ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఈ స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. దానికి కారణం స్లో పిచ్. పవర్ ప్లేలో అభిషేక్, హెడ్ ఎంత ట్రై చేసినా..సిక్సర్లు కొట్టలేకపోయారు. ఇక మిడిల్ ఓవర్స్‌లోనూ నితీశ్‌కుమార్‌రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ శాయశక్తులా ప్రయత్నించినా దక్కలేదు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో క్లాసెన్ సిక్సర్ కొట్టాడు..అదే ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు, ఒక సింగిల్‌తో 21 రన్స్ రాబట్టుకున్నాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఇదే బెస్ట్ ఓవర్. చివర్లో అనికేత్, రెండు సిక్సర్లు..ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు కెప్టెన్ కమిన్స్ ఒక సిక్స్ కొట్టడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరును చేరుకుంది. అభిషేక్ 40 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. క్లాసెన్ 37, హెడ్ 28 రన్స్ సాధించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు తీయగా, బుమ్రా, హార్దిక్, బౌల్ట్‌కు తలా ఒక వికెట్ దక్కింది.
ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవర్‌లో తొలి సిక్స్

Categories:
Related Post

లక్నోకి బ్యాడ్ న్యూస్లక్నోకి బ్యాడ్ న్యూస్
గుజరాత్ టైటన్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే

అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్‌అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్
ఆక్షన్‌లో దక్కిన భారీ ధర..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడా? మెంటల్లీ, టెక్నికల్లీ అంత ఫిట్‌గా అనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్, రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ వశమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం