ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై బ్యాటర్ ర్యాన్ రికెల్టన్..సన్‌రైజర్స్ బౌలర్ జీషన్ హన్సారీ బౌలింగ్ షాట్‌కు ప్రయత్నించి షార్ట్ కవర్‌లో ఉన్న ప్యాట్ కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు కూడా..కానీ అంతలోనే ఊహించని పరిణామం, మ్యాచ్ అఫీషియల్స్ రికెల్టన్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లనివ్వలేదు. ఎందుకంటే థర్డ్ అంపైర్ అది ఔటా, కాదా అని చెక్ చెస్తుండడమే. రికెల్టన్ షాట్ ఆడిన సమయంలో వికెట్ కీపర్ క్లాసెన్ తన గ్లవ్స్‌ను వికెట్ల ముందుకు తెచ్చాడు. రీప్లేలో అది కన్ఫర్మ్ అవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించి రికెల్టన్‌ను మళ్లీ గ్రౌండ్‌లోకి రప్పించారు. ఐతే రికెల్టన్ మరో రెండు బౌండరీలు సాధించి ఔటయ్యాడు. తనకు కలిసొచ్చిన లక్‌ను ఎక్కువసేపు ఉపయోగించుకోలేకపోయాడు.
ఔటై మళ్లీ వచ్చాడు..ఐనా

Categories:
Related Post

ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్…రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్‌లో కీలక స్పిన్నర్. ఐతే ఇతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుజరాత్ మూడు మ్యాచులు ఆడగా..రషీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది

SRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెలవాలిSRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెలవాలి
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయి తమ ప్రయాణాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 4 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్‌కు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే

లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్యలెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్‌శర్మ దగ్గరికి వెళ్లి అతడి