Cricket Josh IPL లో స్కోర్ థ్రిల్ల‌ర్‌లో బ‌ల్లేబ‌ల్లే

లో స్కోర్ థ్రిల్ల‌ర్‌లో బ‌ల్లేబ‌ల్లే

లో స్కోర్ థ్రిల్ల‌ర్‌లో బ‌ల్లేబ‌ల్లే post thumbnail image

రెండొంద‌లు..రెండొంద‌ల‌కు పైగా ర‌న్స్‌ను ఛేజ్ చేసిన సంద‌ర్భాలు చూశాం..య‌మా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న స‌న్‌రైజ‌ర్స్ పై 245 ర‌న్స్‌ కాపాడుకోలేక‌పోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్‌పై 112 ప‌రుగుల స్కోర్‌ను కాపాడుకుని ఇది అంత‌కుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది.  112 ర‌న్స్ ఛేజింగ్‌లో మ్యాచ్ ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది.. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవ‌లం 15.3 ఓవ‌ర్ల‌లోనే 111 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ చిన్న టోట‌ల్‌ను కోల్‌క‌త ఊదేస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ 2 వికెట్ల న‌ష్టానికి 62 ప‌రుగులు ఉన్న ద‌శ నుంచి కోల్‌క‌త కుప్ప‌కూల‌డం వైపుగా ప‌య‌నించింది. పంజాబ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ వేసి గెలుపుపై న‌మ్మ‌కం పెంచుకున్నారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చ‌హాల్ వ‌రుస ఓవ‌ర్ల‌లో వికెట్లు తీసి కోల్‌క‌తాను కోలుకోలేని దెబ్బ‌తీశాడు. ఐతే ఆండ్రె ర‌సెల్ కాసేపు బౌండ‌రీల‌తో భ‌య‌పెట్టినా, మ‌రో ఎండ్‌లో ఉన్న వైభ‌వ్ అరోరా వికెట్ తీసి అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ గెలుపును ఒక వికెట్ దూరంలో నిలిపాడు. ఆ త‌ర్వాతి ఓవర్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న ర‌సెల్..మార్కో యాన్సెన్ వేసిన బాల్‌ను భారీ షాట్ కొట్టేందుకు ప్ర‌య‌త్నించి బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 95 ప‌రుగుల‌కే ముగిసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో యుజ్వేంద్ర చ‌హాల్‌కు 4 వికెట్లు, మార్కో యాన్సెన్‌కు 3 వికెట్లు ద‌క్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

విజిల్ మోగ‌ట్లే..విజిల్ మోగ‌ట్లే..

చెన్నై సూప‌ర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన టీమ్‌..ఈ సీజ‌న్‌లో నాసిర‌కం ఆట‌తీరు క‌న‌బ‌రుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఓట‌మిపాలైంది. హోమ్ గ్రౌండ్‌ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల న‌ష్టానికి

వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..

మొత్తానికి కొన్ని గంట‌లుగా బెంగ‌ళూరులో కురుస్తున్న వ‌ర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్న‌ర‌కు టాస్ వేయ‌గా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో వ‌రుస‌గా మూడోసారి మొద‌ట బ్యాటింగ్ చేయ‌బోతోంది. రెండు సార్లు మొద‌ట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది.