ఐపీఎల్‌లో గాయాల కారణంగా లీగ్ నుంచి నిష్క్రమిస్తున్న ఆటగాళ్ల జాబితా రోజరోజుకూ పెరుగుతోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంప టోర్నీకి దూరమయ్యాడు. భుజం గాయం తిరగబెట్టడంతో అతడు లీగ్‌కు దూరమవ్వనున్నట్టు సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ తెలిపింది. 2023 ప్రపంచకప్‌కు ముందే ఆడమ్ జాంప భుజం నొప్పితో బాధపడుతూ కొన్నాళ్లు చికిత్స పొందాడు. త్వరగానే రికవర్ అయి ప్రపంచకప్‌లో ఆడాడు. ఐతే ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళుతున్న జాంప కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఐతే అతడికి రీప్లేస్‌మెంట్‌గా కర్నాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్‌ను జట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్. ఇక ఇలా గాయాల కారణంగా ఇప్పటి వరకు టోర్నీకి ఎవరెవరు దూరమయ్యారంటే..
1. రుతురాజ్ గైక్వాడ్- చెన్నై సూపర్ కింగ్స్
2. లాకీ ఫెర్గుసన్- పంజాబ్ కింగ్స్
3. మొహిసిన్ ఖాన్ – లక్నో సూపర్ జెయింట్స్
4. హ్యారీ బ్రూక్- ఢిల్లీ క్యాపిటల్స్
5. ఉమ్రాన్ మాలిక్- కోల్‌కత నైట్‌రైడర్స్
6. ఆడమ్ జాంప- సన్‌రైజర్స్ హైదరాబాద్
7. గ్లెన్ ఫిలిప్స్- గుజరాత్ టైటన్స్
జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్దదే?

Categories: