మొన్ననే మనం అనుకున్నాం..చెన్నై సూపర్ కింగ్స్ గుంటూరు కుర్రాడు షేక్ రషీద్‌ను ఆడిస్తే బాగుంటుందని…ఆ మ్యాచ్‌లో అవకాశం రాలేదు గానీ, లక్నో సూపర్ జెయింట్స్‌పై లక్ కలిసొచ్చింది..నిజమే ఎందుకంటే రుతురాజ్ గాయం కారణంగా లీగ్‌కు దూరమవడం..ఓపెనర్‌గా డెవాన్ కాన్వే విఫలమవుతుండటం…దీంతో బెంచ్‌పై ఉన్న ఆప్షన్స్‌ను పరీక్షించాలనుకుంది సీఎస్కే. ఇంకేముంది రషీద్‌కు చాన్స్ దక్కింది. ఇప్పటి వరకు దేశవాళీ టీ20ల్లో ఓపెనింగ్‌లో ఆడని రషీద్‌ను జట్టులో తీసుకోవడమే కాదు..ఏకంగా ఓపెనర్‌గా పంపించింది సీఎస్కే. ఐతే ఈ తెలుగు కుర్రాడు ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడాడు. పక్కా క్రికెటింగ్ షాట్స్‌తో ఫోర్లు కొట్టి అలరించాడు. సహజ సిద్ధ క్రికెట్‌కు భిన్నంగా చిత్రవిచిత్రమైన షాట్లతో రెచ్చిపోయే ఈ ఫార్మాట్‌లో ఆడిన కాసేపైనా క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు రషీద్. తొలి మ్యాచ్‌లోనే క్వాలిటీ ప్లేయర్‌లాగా కనిపించాడు. 19 బాల్స్‌లో 26 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. రషీద్‌కు సీఎస్కే మరిన్ని అవకాశాలివ్వాలని ఆశిద్దాం
గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్

Categories:
Related Post

ఎవరి ఆశలు నిలబడతాయ్..?ఎవరి ఆశలు నిలబడతాయ్..?
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ

అట్లుంటది సిరాజ్‌తోని..అట్లుంటది సిరాజ్‌తోని..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నడు. తన మాజీ టీమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. తను ఏడు సీజన్లపాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్నస్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా

ధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదుధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదు
టీమిండియా లెజెండ్స్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందా? అంటే కానే కాదు..ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్..జస్ట్ గేమ్‌ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్‌లో తప్ప ఇంకెక్కడా ఆడటం లేదు..