కరుణ్ నాయర్, ఈ పేరు గుర్తుంది కదా..హార్డ్‌కోర్ టీమిండియా ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా, ఓవరాల్ క్రికెట్‌లో మూడో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కనుమరుగయ్యాడు. ఐపీఎల్‌లోనూ అంతంత మాత్రంగానే మెరిశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడటం ఇది మూడో సీజన్. గతంలో 2016,17లో ఢిల్లీకి ఆడిన కరుణ్ ఈ సీజన్‌కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో బేస్ ప్రైస్ రూ. 50 లక్షలకే ఢిల్లీ వశమయ్యాడు.
ఐతే ఈ సీజన్‌లో ఢిల్లీ 5 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆరో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా కరుణ్ నాయర్‌కు అవకాశం ఇచ్చింది. చాన్స్ వస్తే ఎలా ఉపయోగించుకోవాలో తనను చూసి నేర్చుకోవాలంటే ఎంతో మందికి ఇన్స్‌ప్రేషన్ ఇచ్చే ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అతడు కొట్టిన బౌండరీలు క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. 40 బాల్స్‌లో 89 రన్స్ చేసి ఔటయ్యాడు. కరుణ్ ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే ఢిల్లీని గెలిపించేవాడే..కానీ దురదృష్టవశాత్తు అతడు ఔటవడం..ఢిల్లీ ఓటమిపాలవడం అలా జరిగిపోయాయి. కానీ కరుణ్‌లో ఇంకా పరుగుల కసి తగ్గలేదనేది మాత్రం అభిమానులకు, టీమ్ మేనేజ్మెంట్‌కు అర్థమైంది. మరి కరుణ్‌కు ఢిల్లీ ఇంకిన్ని అవకాశాలు ఇస్తుందా అనేది ఆసక్తికర విషయం.
మూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదు

Categories: