కర్ణ్‌శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అసలైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 పరుగుల టార్గెట్ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేసి ముంబై గెలుపు అవకాశాలకు నాంది పలికాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు రెచ్చిపోవడంతో ముంబై గెలుపు పూర్తైంది. కర్ణ్‌శర్మకు ముంబై తరపున ఈ సీజన్‌లో తొలి మ్యాచ్. ఐతే ముంబైకి ఆడటం ఇది రెండో సీజన్.
2014లోనే టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ఈ లెగ్ స్పిన్నర్..ఒక టెస్ట్ మ్యాచ్, రెండు వన్డేలు, ఒక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీమిండియాకు ప్రాతినిథ్యం వహించలేకపోయాడు. జాతీయ జట్టులో అవకాశాలు రాకపోయినా, ఐపీఎల్‌లో మాత్రం రెగ్యులర్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 4 టీమ్స్‌కు ఆడిన కర్ణ్‌శర్మ..ఈ సీజన్ మెగా ఆక్షన్‌లో రూ. 50 లక్షలకు ముంబై వశమయ్యాడు. కర్ణ్ ముంబైకి ఆడటం ఇది రెండో సారి. ఆర్సీబీకి 3 సీజన్‌లు, సీఎస్కేకి 3 సీజన్‌లు, సన్‌రైజర్స్‌కి 4 సీజన్‌లు ఆడాడు. ఐతే ఒక సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీసింది మాత్రం సన్‌రైజర్స్ తరపునే..2014లో ఎస్ ఆర్ హెచ్ తరపున ఆడి 15 వికెట్లు తీశాడు. ఐతే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ మాత్రం ముంబై తరపున ఆడినపుడు లభించాయి. 2017లో ముంబై తరపున ఆడి కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 4/16 గణాంకాలు నమోదు చేశాడు.
బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కి

Categories: