ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎప్పుడూ స్పెషలే, డిబేటబులే..ఆ డిస్కషన్ గురించి కాదుగానీ, ఓ సరదా సన్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. లక్నో, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లక్నో ఛేజింగ్ చేస్తున్న సమయంలో..ఇన్నింగ్స్ 13వ ఓవర్ తర్వాత స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ ఉంది. ఐతే అంపైర్ అనుకోకుండా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేటపుడు ఏదైతే సిగ్నల్ ఇస్తాడో..స్ట్రాటెజిక్ టైమ్ ఔట్‌కి అదే సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే తన పొరపాటును గమనించి చిరునవ్వుతో మళ్లీ స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ సిగ్నల్‌ను సరిగా ఇచ్చాడు. ఇంతకీ ఈ అంపైర్ పేరు ఏంటంటారా..ఉల్లాస్ గాంధే, నాగ్‌పూర్‌కు చెందిన మాజీ క్రికెటర్. ఇతడు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు.
అట్లుంటది “ఇంపాక్ట్”

Categories:
Related Post

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..
చెన్నై సూపర్ కింగ్స్, దాదాపుగా తమ ప్లేయింగ్ లెవన్‌ను మార్చదు. టీమ్ నిండా సీనియర్ ప్లేయర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజన్‌లో మిగతా ఫ్రాంచైజీలు కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్, విఘ్నేశ్,

పే…..ద్ద ఓవర్పే…..ద్ద ఓవర్
శార్దూల్ ఠాకూల్…ఉరఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో వరుసగా 5 వైడ్‌లు వేశాడు. ఆ తర్వాతే లీగల్‌గా ఓవర్ మొదలైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవర్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా పే…ద్ద

నితీశ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌నితీశ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్
బీసీసీఐ ప్రతి ఏడాది ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు దక్కింది. ఇక గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టు దక్కని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఈసారి మళ్లీ