అదీ లెక్క..సన్‌రైజర్స్ కొడితే ఏనుగు కుంభస్థలమే..246 పరుగుల టార్గెట్..వీళ్ల ఆట ముందు చిన్నదైపోయింది. ఇక్కడ గెలుపోటముల ప్రస్థావన కాదు, లీగ్‌లో మరింత ముందుకెళతారో లేదో అనే లెక్కల గురించి కాదు, మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ల ఇంటెంట్ గురించి..ఆ ఇంటెంట్ గెలిచింది, గెలిపించింది. ఒకటే పంథా..ఇదే వారి బలం..బలగం. నమ్ముకున్న ఫార్ములాతో మరోసారి కుమ్మిపడేసింది కమిన్స్ గ్యాంగ్. కాకపోతే ఆ ఫార్ములాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసేందుకు చిన్నచిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారంతే. మొదట బౌలింగ్‌లో కనిపించిందీ అదే..స్లో బాల్స్, స్లో బౌన్సర్స్, యార్కర్స్..ఇలా ఈ బ్యాటింగ్ ట్రాక్‌పై ఏ బాల్స్ ఎప్పుడు వేయాలో అప్పుడు వేశారు. ప్రత్యర్థి భారీగా కొడితే కొట్టనియ్..చూస్కుందాంలే అనుకున్నారు. ధైర్యంగా బౌలింగ్ ముగించారు.
ఆ ధైర్యం..ఆ ఇంటెంట్ బ్యాటర్లూ కూడా ప్రదర్శించి పంజాబ్ కింగ్స్ కొట్టిన భారీ స్కోర్ (245)ను ఎదురు బెదురూ లేకుండా ఛేజ్ చేశారు. ఓపెనర్ అభిషేక్‌శర్మ 40 బాల్స్‌లోనే శతక్కొట్టాడు. ఐపీఎల్‌లో ఇదే అతనికి తొలి సెంచరీ. ఇక ట్రావిస్ హెడ్ కూడా ఇరగదీశాడు. ఈ ఇద్దరూ ఎక్కడైతే పోగొట్టుకున్నారో, అక్కడే మళ్లీ దొరకబుచ్చుకున్నారు. తొలి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం, అది కూడా 74 బాల్స్‌లో. ఇవి రికార్డులే కావచ్చు. కానీ వాళ్లకు కొత్తేమీ కాదు, జబ్బలు చరుచుకునే టైపూ కాదు. తర్వాత గేమ్ కూడా ఇలాగే ఆడతారు..డకౌట్ ఐనా, డగౌట్‌లో చప్పట్లైనా సరే..అదే ఇంటెంట్..అదే కంటెంట్..
ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..

Categories: