Cricket Josh IPL వందేసి.. చిందేసిన జోడి

వందేసి.. చిందేసిన జోడి

వందేసి.. చిందేసిన జోడి post thumbnail image

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న‌ గుజ‌రాత్ టైట‌న్స్‌కు ఓపెనింగ్ జోడి వంద ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. తొలి వికెట్‌కు 120 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. గిల్ 60 ర‌న్స్ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఈ జోడి కేవ‌లం 58 బంతుల్లోనే వంద ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఈ సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్‌లో గిల్ హాఫ్ సెంచ‌రీ చేయ‌గా..ఆ త‌ర్వాత మ‌రో ప‌ది ప‌రుగుల వ్య‌వ‌ధిలో సాయి సుద‌ర్శ‌న్ కూడా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ గిల్ 31 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేయ‌గా, ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. గిల్‌కు 6 మ్యాచుల్లో ఇది రెండో హాఫ్ సెంచ‌రి. ఇక‌ సాయి సుద‌ర్శ‌న్ 32 బంతుల్లో ఫిఫ్టీ కంప్లీట్ చేయ‌గా, అందులో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. సాయి సుద‌ర్శ‌న్ ఆడిన 6 మ్యాచుల్లో ఇది నాలుగో హాఫ్ సెంచ‌రీ. మిగ‌తా రెండు మ్యాచుల్లో స‌న్‌రైజ‌ర్స్‌పై 5, ఆర్సీబీపై 49 ర‌న్స్ చేశాడు. కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కు ఔట‌య్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

విజిల్ మోగ‌ట్లే..విజిల్ మోగ‌ట్లే..

చెన్నై సూప‌ర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన టీమ్‌..ఈ సీజ‌న్‌లో నాసిర‌కం ఆట‌తీరు క‌న‌బ‌రుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఓట‌మిపాలైంది. హోమ్ గ్రౌండ్‌ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల న‌ష్టానికి

జైపూర్‌లోనూ ల‌క్ ల‌క్నోదేజైపూర్‌లోనూ ల‌క్ ల‌క్నోదే

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద్బుత విజ‌యం సాధించింది. ల‌క్నో విసిరిన 181 ప‌రుగుల టార్గెట్‌ను చేదించే క్ర‌మంలో చివ‌రి బాల్ వ‌ర‌కు టెన్ష‌న్ కొన‌సాగింది. ఒక‌ద‌శ‌లో రాయ‌ల్స్ ఈజీగా మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే

ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవ‌ర్‌లో తొలి సిక్స్ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవ‌ర్‌లో తొలి సిక్స్

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. ఈ స్లో పిచ్‌పై స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది ప‌డ్డారు. దానికి కార‌ణం స్లో పిచ్‌. పవ‌ర్ ప్లేలో