గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్‌ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఆక్షన్‌లో హిమ్మత్‌సింగ్‌ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. హిమ్మత్ గతేడాది చివర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పెద్దగా రాణించకపోయినప్పటికీ..ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అతని ప్రతిభకు పట్టం కట్టారని చెప్పొచ్చు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా అదరగొట్టి ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ రైడర్ జట్టుకు ట్రోఫీ అందించాడు. అంతేకాదు ఈ లీగ్‌లో ఎక్కువ రన్స్ సాధించిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. పది మ్యాచుల్లో 381 రన్స్ చేయగా, అందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ 165 కంటే ఎక్కువగా ఉండటం ప్లస్ పాయింట్. మరి లక్నో సూపర్ జెయిట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ బాయ్ కదా..కొంచెం ఆట, కొంచెం లోకల్ సెంటిమెంట్ కూడా ఉండొచ్చేమో మరి..తప్పు లేదులే.
ఎవరీ హిమ్మత్ సింగ్..?

Related Post

లక్నో రిటర్న్ గిఫ్ట్లక్నో రిటర్న్ గిఫ్ట్
గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ విరుచుకుపడటం గురించే అంతా మాట్లాడుకున్నారు. కానీ ఈ సీజన్‌లో లక్నో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. సన్‌రైజర్స్ విసిరిన 191 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించింది. సన్‌రైజర్స్ బౌలింగ్‌ను

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయగల సమర్థుడు.

ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫారిన్ ప్లేయర్స్ జాక్‌పాట్ కొట్టడం చాలా సార్లు చూశాం. మరి ఈసారి మెగా ఆక్షన్‌లో ఎవరు ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌గా రికార్డు సృష్టిస్తారో ఒక అంచనా వేద్దాం. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20