చెన్నై సూపర్ కింగ్స్, దాదాపుగా తమ ప్లేయింగ్ లెవన్‌ను మార్చదు. టీమ్ నిండా సీనియర్ ప్లేయర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజన్‌లో మిగతా ఫ్రాంచైజీలు కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్, విఘ్నేశ్, ప్రియాన్ష్, సత్యనారాయణ రాజు..ఇలా చాలా మందే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీకి దూరమవడంతో ప్రస్తుతం ఆ స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ధోని నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు కదా..
నిజానికి రాహుల్ త్రిపాఠి లేదా దీపక్ హుడాను ప్లేయింగ్ లెవన్‌లో తీసుకోవచ్చు. కానీ ఒకసారి బెంచ్ వైపు చూస్తే..తెలుగు కుర్రాడు షేక్ రషీద్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటిన ఆండ్రె సిద్ధార్థ్ కనిపిస్తారు.షేక్ రషీద్ అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు. గుంటూరుకు చెందిన 20 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్..2023 నుంచి సీఎస్కే టీమ్‌లో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఐనా అరంగేట్రం అవకాశం దక్కుంతుందని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరి ఇవాళ కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో యంగ్‌స్టర్స్‌కు అవకాశమిస్తారా? లేదంటే సీనియర్ల వైపే మొగ్గు చూపుతారా?
గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

Categories: