థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్‌గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి ఉండదు. ఆ అవమానానికి బాధ్యత వహించేందుకు మహేంద్రుడు నాయకత్వం తీసుకున్నాడేమో, ఫాఫమ్. అన్నిటికీ మించి ధోని 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు రావడమనేది కూడా బ్లండర్ అనే చెప్పాలి. ఇన్నేళ్ల కీర్తి..అపకీర్తిగా మారకముందే మహేంద్రుడు మేలుకోవాలి. ఐతే ఒక్క ధోనినే నిందించడమూ కరెక్ట్ కాదు, లోపం కెప్టెన్‌దో, ప్లేయర్స్‌దో కాదు…టీమ్‌లో మునపటి వాతావరణం కనిపించడం లేదు..ఆ విన్నింగ్ స్పిరిట్ కనిపించడం లేదు..ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా లేదు. మొత్తానికి ఏదో మిస్పవుతోంది. సైకలాజికల్ విషయాలు పక్కన పెట్టి, ప్రాక్టికల్స్ మాట్లాడుకుంటే…ప్లేయింగ్ లెవన్ సరిగా కుదరడం లేదు. అన్నిటికీ మించి ముగ్గురు నలుగురు ఔట్ డేటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్, ఇది క్రికెటర్లను కించపరిచే ఉద్దేశం కాకపోయినప్పటికీ నిజం అదే.. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్..ఇలాంటి త్రీడీ ప్లేయర్లు అవసరమా..? పోనీ వాళ్లకేమన్నా అద్బుతమైన ట్రాక్ రికార్డ్ ఉందా, అంటే అదీ లేదు..భూతద్దం పెట్టి వెతికినా మ్యాచ్ విన్నర్ కనిపించడం లేదు..టీమ్‌లో ఎమ్ ఎస్ ధోని మ్యాచ్ విన్నరే..కానీ ఎన్ని దశాబ్దాలు ఆ బరువు మోయగలడు, జడేజా కూడా ప్రామినెంట్ క్రికెటరే..అతడూ మానవ మాత్రుడే కదా..శివమ్ దూబె కాసేపు దడదడలాడిస్తాడు, కానీ మ్యాచ్ విన్నర్ అనే గొప్ప హోదాకు అతడింకా అర్హుడు కాదు. ఫారిన్ ప్లేయర్స్ విషయానికొస్తే..రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఈ ఫార్మాట్‌లో కన్సిస్టెంట్ ప్లేయర్స్ కాదు..కాన్వే ఒక సీజన్ బాగానే ఇరగదీశాడు..రచిన్ వన్డే ఫార్మాట్‌లో తోపు, టీ20ల్లో ప్రతీసారి అంటే కష్టమే..ఫైనల్‌గా…సీఎస్కే గురించి ఒక మంచి విషయం చెప్పుకోవాలంటే, అది నూర్ అహ్మద్ గురించే..ఈ ఆఫ్గన్ స్పిన్నర్ ఒక్కడే కన్సిస్టెంట్‌గా రాణిస్తున్నాడు.
మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?

Categories:
Related Post

రనౌట్‌పై గిల్ అసంతృప్తిరనౌట్‌పై గిల్ అసంతృప్తి
సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ 38 బాల్స్‌లో 76 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఐతే థర్డ్ అంపైర్ ఇచ్చిన రనౌట్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔటైన అనంతరం డగౌట్‌కు వెళ్తూ అక్కడున్న ఫోర్త్ అంపైర్

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..
నవంబర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అంతా సిద్ధమైంది. ఆటగాళ్లు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఆక్షన్ లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోగా, ఇందులో

అట్లుంటది సిరాజ్‌తోని..అట్లుంటది సిరాజ్‌తోని..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నడు. తన మాజీ టీమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. తను ఏడు సీజన్లపాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్నస్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా