మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయగల సమర్థుడు. గతంలో అతడు సాధించిన రికార్డులే చెబుతాయి, వాట్ హీ డిడ్..అని
ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోనీదే రికార్డు. 133 మ్యాచుల్లో గెలిచి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న రోహిత్ పేరిట 87 విజయాలున్నాయి. మూడో స్థానంలో విరాట్ 66 విజయాలతో ఉన్నాడు. కెప్టెన్‌గా ఎక్కువ సిక్స్‌లు కొట్టిన రికార్డు కూడా ధోని పేరిటే ఉంది. ధోని 218 సిక్స్‌లు కొట్టగా, విరాట్ 168, రోహిత్ 158 సిక్సులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇక కెప్టెన్‌గా ఎక్కువ రన్స్ చేసిన జాబితాలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 4990 రన్స్‌తో తొలి స్థానంలో ఉండగా, ధోని 4660 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 4వేల మార్క్ దాటిన కెప్టెన్లు ఈ ఇద్దరే.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో రికార్డులు మహేంద్రుడి సొంతం. ఐతే ఇంత అనుభవం ఉన్న నాయకుడు సీఎస్కే ఫేట్ మారుస్తాడో చూడాలి. ధోని కెప్టెన్సీ యాక్షన్ మొదలయ్యేది ఇవాళ సాయంత్రం చెపాక్ స్టేడియంలో కోల్‌కత నైట్‌రైడర్స్‌తోనే.
నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి

Categories: