Cricket Josh IPL ఇదేంద‌య్యా ఇది..163 ఏంద‌య్యా

ఇదేంద‌య్యా ఇది..163 ఏంద‌య్యా

ఇదేంద‌య్యా ఇది..163 ఏంద‌య్యా post thumbnail image

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా త‌క్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, ప‌వ‌ర్ ప్లేలో 64 ర‌న్స్ చేసి 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..ఆ త‌ర్వాత కోహ్లీ (22), కెప్టెన్ ప‌తిదార్ (25)ను కోల్పోవ‌డంతో క‌ష్టాల్లో ప‌డింది. అనంత‌రం లివింగ్‌స్ట‌న్‌, జితేశ్ కూడా సింగిల్ డిజిట్స్‌కే ఔట‌వ‌డంతో స్కోరు వేగం మంద‌గించింది. కృనాల్ (18) స‌హ‌కారంతో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) ఆఖ‌ర్లో రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్లు బాదాడు. డేవిడ్ ఈ రేంజ్‌లో ఆడితేనే ఆర్సీబీకి క‌నీసం 163 ప‌రుగులైనా వ‌చ్చాయి. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్‌, విప్ర‌జ్ చెరో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ మిడిల్ ఆర్డ‌ర్‌ని కోలుకోలేని దెబ్బ‌తీశారు. ఈ ఇద్ద‌రూ 5 కంటే త‌క్కువ ఎకాన‌మీతో ర‌న్స్ ఇవ్వ‌డం హైలైట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

పంజాబ్ కా స్వీట్ 16..పంజాబ్ కా స్వీట్ 16..

ప్రియాన్ష్ ఆర్య‌..ద సెంచ‌రీ హీరో. పంజాబ్ కింగ్స్‌కు భారీ స్కోర్ అందించ‌డ‌మే కాదు, రికార్డు పుస్త‌కాల్లో త‌న పేరు లిఖించుకున్నాడు. ఈ సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌పున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స్‌లు

14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం..14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం..

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వ‌య‌సులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెట‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వ‌న్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వ‌య‌స్కుడిగా సూర్య‌వ‌న్షి ఉండ‌గా..అంత‌కు ముందు ప్ర‌యాస్ రే బ‌ర్మ‌న్ ఆర్సీబీ త‌ర‌పున 16 ఏళ్ల

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..

హోమ్ గ్రౌండ్‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్..ఇదేదో క‌లిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వ‌ర్షం కార‌ణంగా కుదించిన 14 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 95 ర‌న్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,