క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వదిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుందనేది మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఆ విషయం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదార్‌కు బాగా అర్థమై, అనుభవమై ఉంటుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోయే అవకాశాన్ని పతిదార్ చేజేతులా తోసిపుచ్చాడు. కేఎల్ రాహుల్ 5 పరుగుల మీద ఉన్నపుడు ఇచ్చిన క్యాచ్‌ను రజత్ పతిదార్ జారవిడిచాడు. అక్కడ లైఫ్ పొందిన రాహుల్ మళ్లీ తప్పు చేయలేదు. నిలకడగా ఆడుతూ ఒకేసారి వేగం పెంచాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత జాస్ హేజిల్‌వుడ్ ఓవర్లో ఏకంగా 22 రన్స్ బాదాడు. దీంతో ఢిల్లీ టార్గెట్ వైపు మరింత వేగంగా దూసుకెళ్లింది. రాహుల్ 53 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో రెచ్చిపోయి 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఢిల్లీని గెలిపించాడు. ఒకవేళ రాహుల్ 5 పరుగుల వద్దే ఔటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మ్యాచ్ అనంతరం రజత్ ఈ విషయమై బాధ పడినప్పటికీ, ఆటలో ఇవన్నీ సహజమే గనుక..మరో మ్యాచ్‌కు ఫ్రెష్‌గా సిద్ధమవ్వాల్సిందే.
ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వదిలేశాడు

Related Post

ముంబైకి మాంచి వికెట్ కీపర్?ముంబైకి మాంచి వికెట్ కీపర్?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మిగతా స్లాట్స్‌ను ఎలా భర్తీ చేసుకున్నా, ఎవరితో భర్తీ చేసుకున్నా సరే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం నిఖార్సైన బ్యాటర్ కమ్ కీపర్ కోసం చూస్తోంది. గతంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిషన్‌ను

బట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్‌కేబట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్‌కే
రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జాస్ బట్లర్..ఆ ఫ్రాంచైజీని వదిలి ఆక్షన్‌లోకి రావాలనుకుంటున్నాడట. ఒకవేళ అదే జరిగితే ఈసారి జరగబోయే మెగా ఆక్షన్‌లో ఇతడికి జాక్‌పాట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా

ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవర్‌లో తొలి సిక్స్ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవర్‌లో తొలి సిక్స్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఈ స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. దానికి కారణం స్లో పిచ్. పవర్ ప్లేలో