మాజీ టీమ్‌పై ఇరగదీయడం అనే ట్రెండ్ ఐపీఎల్‌లో కంటిన్యూ అవుతోంది. తాజాగా కేఎల్ రాహుల్, ఆర్సీబీ మాజీ ఆటగాడు..ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఈ క్లాసీ ప్లేయర్..ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. 164 పరుగుల టార్గెట్‌ను ఛేదిండంలో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీని ఆదుకున్నాడు. 30 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో ఉన్న రాహుల్..కెప్టెన్ అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (38*)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టార్గెట్ దిశగా తీసుకెళ్లాడు. అవసరమైనపుడు గేర్ మార్చి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మొత్తంగా 53 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అది కూడా ఆర్సీబీపై సొంతగ్రౌండ్‌లో. బెంగళూరు బాయ్ రాహుల్‌కు ఇది హెమ్ గ్రౌండ్. 2013లో ఆర్సీబీ తరపునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆ తర్వాత రెండు సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. ఇక 2016లో మళ్లీ ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ సీజన్ ఆర్సీబీ ఫైనల్‌కు కూడా చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతూ ..ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
మాజీ టీమ్‌పై..క్లాసికల్ విధ్వంసం

Categories: