ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు ఫిల్‌సాల్ట్, విరాట్ కోహ్లీ. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కు దిగాడు. ఐనప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. ముఖ్యంగా సాల్ట్ ..మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు స్కోర్ చేశాడు. నాలుగో ఓవర్‌లో మ్యాచ్ టర్న్ అయింది.కెప్టెన్ అక్షర్ పటేల్ రెండో ఓవర్ కంటిన్యూ చేయగా..ఫామ్‌లో ఉన్న ఫిల్‌సాల్ట్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్‌ను ఢిల్లీ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పవర్‌ప్లే ఆఖరి ఓవర్ (6వ ఓవర్)లో ముకేశ్ కుమార్‌ను రంగంలోకి దింపడంతో అతడు..పడిక్కల్‌ను ఔట్ చేసి ఆ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వలేదు. నాలుగు ఓవర్లకే 60 రన్స్ దాటిన ఆర్సీబీ..పవర్ ప్లేను 2 వికెట్లు కోల్పోయి 64 రన్స్‌తో ముగించిందంటే ఢిల్లీ ఏ రేంజ్‌లో కమ్‌బ్యాక్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్

Related Post

ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?
మరోకొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్పటికే మిగతా జట్లు కనీసం ఒకరిద్దరి విషయంలో క్లారిటీకి వచ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా రోహిత్‌శర్మ ఆటగాడిగా కంటిన్యూ అవుతాడా

తలా ఓ మాట అంటున్నారు..తలా ఓ మాట అంటున్నారు..
చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు..ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనిపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే తలాను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇంకెంతకాలం తలా తలా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయన బ్యాటింగ్

ఇటు కింగ్..అటు కేఎల్ కమింగ్..ఇటు కింగ్..అటు కేఎల్ కమింగ్..
లక్నో సూపర్ జెయింట్స్ వదులుకునేందుకు సిద్ధపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జరిగాయట. కేఎల్ రాహుల్ నమ్మ కన్నడిగ అంటూ ఇప్పటికే సోషల్