ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ రషీద్‌ఖాన్‌కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ సీజన్‌లో సీన్ మారింది. రషీద్ ఈ మ్యాచ్‌లో ఐనా వికెట్ తీస్తాడా అనేలా అతడి ఫామ్ పడిపోయింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా..తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ వికెట్లేమీ దక్కలేదు. పోనీ రన్స్ కట్టడి చేశాడా అంటే అదీ లేదు. ఐతే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ఖాన్‌కు కాస్త ఊరట లభించింది. మూడు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ వికెట్ దక్కింది. ధృవ్ జురేల్‌ను ఔట్ చేయడం ద్వారా వికెట్ల లోటును భర్తీ చేసుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్లో శుభమ్ దూబెను కూడా ఔట్ చేసి ..మొత్తానికి ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.
రషీద్ వికెట్ తీశాడోచ్..

Related Post

విజిల్ మోగట్లే..విజిల్ మోగట్లే..
చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్..ఈ సీజన్‌లో నాసిరకం ఆటతీరు కనబరుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే

బట్లర్.. వాహ్ చేజ్బట్లర్.. వాహ్ చేజ్
గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్..సెంచరీ మిస్ చేసుకున్నా సరే, తన టీమ్‌ను దగ్గరుండి మరీ గెలిపించాడు. అది కూడా 204 పరుగుల టార్గెట్..అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి