మాజీ టీమ్‌లపై ప్లేయర్స్ పగబట్టినట్టుగా పెర్ఫార్మ్ చేయడం ఐపీఎల్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ లక్నో తరపున ఆడుతూ..తమ మాజీ టీమ్ సన్‌రైజర్స్‌పై ఇరగదీశారు. మొన్నటికి మొన్న గుజరాత్‌కు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ తన మాజీ టీమ్ సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఆడుతున్న పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..తన మాజీ టీమ్ ఆర్సీబీపై విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంది. మరి ఇప్పుడు గుజరాత్‌కు ఆడుతున్న జాస్ బట్లర్, గత సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్‌కు ఆడినవాడే. అంతేకాదు ఆ టీమ్ తరపున సెంచరీలు బాది..ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. మరి ఐపీఎల్ ట్రెండ్ ప్రకారం బట్లర్ తన మాజీ టీమ్ రాయల్స్‌పై విధ్వంసం చేయడం ఖాయమే అనిపిస్తోంది. అసలే ఫామ్ కోసం ఎదురుచూస్తున్న బట్లర్‌కు ఇదే రైట్ టైమ్. ఇక గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ కూడా గత సీజన్ వరకూ రాయల్స్‌కే ఆడాడు. మరి ఇతడు కూడా మాజీ టీమ్‌పై అద్బుతమైన బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఏదేమైనా రాజస్థాన్ రాయల్స్ తమ మాజీ ప్లేయర్స్‌పై ఓ లుక్కేయాల్సిందే. ఈ జాబితాలో రాహుల్ తెవాటియా కూడా ఉన్నాడండోయ్..మరి అతడికైతే బ్యాటింగ్ అవకాశాలు పెద్దగా రావట్లే, ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో తన మాజీ టీమ్ రాయల్స్‌కు బాగా తెలుసు.
బట్లర్ రెడీ..రాయల్స్ బీ కేర్ ఫుల్

Related Post

కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్
కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు.

అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్‌అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్
ఆక్షన్‌లో దక్కిన భారీ ధర..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడా? మెంటల్లీ, టెక్నికల్లీ అంత ఫిట్‌గా అనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్, రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ వశమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయగల సమర్థుడు.