గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య థ్రిల్లర్ మ్యాచ్ జరగడం ఖాయం..వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉంది టైటన్స్…ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది రాయల్స్. రెండు టీమ్‌లూ గెలుపు జోరుతో ఈ మ్యాచ్‌కు దూసుకొస్తున్నాయి. ఇరుజట్లలోని స్టార్ ప్లేయర్స్ ఫామ్‌లోకి రావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి.
గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఫామ్‌లోకొచ్చిన ఓపెనర్ కమ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పుడు హోమ్ గ్రౌండ్‌లో తడాఖా చూపేందుకు రెడీ అయ్యాడు. అటు రాయల్స్ ఓపెనర్ జైస్వాల్ కూడా గత మ్యాచ్‌లో
పంజాబ్‌పై హాఫ్ సెంచరీ చేసి టచ్‌లోకొచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు బిగ్ ఇన్నింగ్స్ ఆడి తమ టీమ్ గెలుపులో కీ రోల్ ప్లే చేస్తారనేది ఆసక్తికరం. మంచి ఆరంభం దొరకాలంటే టైటన్స్‌కి సాయి సుదర్శన్, రాయల్స్‌కి కెప్టెన్ సంజూ శాంసన్ కీలకం. వాషింగ్టన్ సుందర్, రూథర్‌పోర్డ్ సూపర్ టచ్‌లోకి రావడం టైటన్స్‌కి కలిసొచ్చే అంశం.
రాయల్స్‌కు కూడా పరాగ్, నితీశ్, హెట్‌మెయిర్, జురేల్‌తో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఐతే వీళ్ల కు టైటన్స్ స్పిన్నర్ సాయికిశోర్ నుంచి సవాల్ ఎదురుకానుంది. ఇక రషీద్ ఖాన్ కూడా ఫామ్‌లోకి వస్తే గుజరాత్ బౌలింగ్‌కు తిరుగుండదు. రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ కూడా ఫామ్‌లో ఉండటం..టైటన్స్ బ్యాటర్లకు మింగుడుపడని విషయం. ఏదేమైనా హోరాహోరీ పోరైతే తప్పదు. ఐతే గెలుపు అవకాశాలు మాత్రం గుజరాత్ టైటన్స్‌కే ఎక్కువ ఉన్నాయి.
బిగ్ మ్యాచ్..బిగ్ ప్లేయర్స్..ఫ్యాన్స్‌కు పండగే

Categories: