గుజరాత్…ఆవా దే (గుజరాతీ భాషలో తీసుకురండి)..వాళ్ల ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే మరో 2 పాయింట్లను తీసుకొచ్చింది. టైటన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్ వన్ సైడ్ చేసేసింది. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 82 రన్స్ చేయగా, మిడిల్ ఆర్డర్‌లో బట్లర్, షారుక్ చెరో 36 రన్స్ చేశారు. చివర్లో రాహుల్ తెవాటియా 12 బాల్స్‌లో 24 నాటౌట్ , రషీద్ ఖాన్ 4 బాల్స్‌లో 12 రన్స్ తో మెరుపులు మెరిపించగా, రాయల్స్ భారీ స్కోరు సాధించింది.
217 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో బరిలోకి దిగిన రాయల్స్ ఆది నుంచే ఇబ్బందులు పడింది. జైస్వాల్, నితీశ్, జురేల్ సింగిల్ డిజిట్స్‌కే ఔటయ్యారు. సంజూ శాంసన్ 41, పరాగ్ 26 చేసి క్రీజులో నిలవలేకపోయారు. షిమ్రన్ హెట్‌మెయిర్ హాఫ్ సెంచరీ చేయడంతో రాయల్స్ కనీసం 150 పరుగులైనా దాటగలిగింది. రాయల్స్ ఇన్నింగ్స్ 159 పరుగుల వద్ద ముగిసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ గెలుపుతో గుజరాత్ టైటన్స్ 8 పాయింట్లతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
గురితప్పని గుజరాత్

Categories: