Cricket Josh IPL కింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దే

కింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దే

కింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దే post thumbnail image

పంజాబ్ కింగ్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య‌ జ‌రిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచ‌రీ సాయంతో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. వ‌రుస‌గా ఐదుగురు బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్‌కే ఔట‌వ‌గా (ప్ర‌భ్‌సిమ్ర‌న్ 0), శ‌శాంక్ సింగ్‌, ఆర్య‌తో క‌లిసి ఆరో వికెట్‌కు 71 ర‌న్స్ జోడించాడు. ఆర్య ఔటైన త‌ర్వాత శ‌శాంక్ , మార్కో య‌న్సెన్‌తో క‌లిసి దూకుడు కంటిన్యూ చేశాడు. శ‌శాంక్ 36 బాల్స్‌లో 52 నాటౌట్, య‌న్సెన్ 19 బాల్స్‌లో 34 నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌల‌ర్ల‌లో ఖ‌లీల్, అశ్విన్‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి.
217 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌డంలో చెన్నై విఫ‌ల‌మైంది. ఓపెన‌ర్ల‌లో ర‌చిన్ 39 ర‌న్స్ చేయ‌గా, కాన్వే 69 ర‌న్స్ చేసి రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత దూబె 42, ధోని 27 ర‌న్స్ చేసిన‌ప్ప‌టికీ..చివ‌ర్లో సాధించాల్సిన‌ ర‌న్‌రేట్ పెర‌గ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. పంజాబ్ పేస‌ర్ ఫెర్గుస‌న్‌కు 2 వికెట్లు ద‌క్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రైజర్స్ ఫాలింగ్‌..రైజర్స్ ఫాలింగ్‌..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో 5వ ఓట‌మి. ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ఓట‌మి చ‌విచూసింది. పిచ్ స్లోగా ఉండ‌టం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త క‌లిసొచ్చిన‌ప్ప‌టికీ…స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. ముంబై బౌల‌ర్లు ప‌క్కా ప్లానింగ్‌తో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌ను

ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..

అదీ లెక్క‌..స‌న్‌రైజ‌ర్స్ కొడితే ఏనుగు కుంభ‌స్థ‌ల‌మే..246 ప‌రుగుల టార్గెట్‌..వీళ్ల ఆట ముందు చిన్న‌దైపోయింది. ఇక్క‌డ గెలుపోట‌ముల ప్ర‌స్థావ‌న కాదు, లీగ్‌లో మ‌రింత ముందుకెళ‌తారో లేదో అనే లెక్క‌ల గురించి కాదు, మ‌నం మాట్లాడుకోవాల్సింది వాళ్ల ఇంటెంట్ గురించి..ఆ ఇంటెంట్‌ గెలిచింది, గెలిపించింది.

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించి విజ‌యాల సిక్స‌ర్ కొట్టింది. 12 పాయింట్ల‌తో టేబుల్‌లో టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతోంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్‌కు మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్ సాయి సుద‌ర్శ‌న్, కెప్టెన్