కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిసింది.పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ (81) తో దుమ్మురేపగా, విధ్వంస ప్రేమికుడు నికోలస్ పూరన్ కేకేఆర్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 36 బాల్స్‌లో 84 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 రన్స్ చేసింది.
239 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌కు పవర్‌ప్లేలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ ఔటవగా..ఆ తర్వాత కెప్టెన్ రహానే, వెంకటేశ్ అయ్యర్ దూకుడుగా ఆడి గెలుపుపై ఆశలు నింపారు. రహానే 35 బాల్స్‌లో 61 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ 45 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ ఇద్దరూ ఔటైన తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌లో 6 బాల్స్‌లో 24 రన్స్ కావాలి. ఈ దశలో క్రీజులో రింకూ సింగ్, బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ ఉన్నారు. ఐతే బిష్ణోయ్ 19 రన్స్ ఇచ్చి కేకేఆర్ గెలుపును దూరం చేశాడు. దీంతో లక్నో 4 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.
భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్

Categories: