శార్దూల్ ఠాకూల్…ఉరఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో వరుసగా 5 వైడ్‌లు వేశాడు. ఆ తర్వాతే లీగల్‌గా ఓవర్ మొదలైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవర్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా పే…ద్ద ఓవర్లు వేయడం ఇది మూడోసారి. గతంలో మహ్మద్ సిరాజ్, ముంబైపై 2023లో 11 బాల్స్ ఓవర్ వేశాడు. అదే సీజన్‌లో తుషార్ దేశ్‌పాండే లక్నోపై 11 బాల్స్ ఓవర్ వేశాడు.
గతేడాది ఛాంపియన్స్ ట్రోఫిలో మహ్మద్ షమి పాకిస్తాన్‌పై 11 బాల్స్ వేశాడు. అందులో 5 వైడ్‌లు ఉన్నాయి.
జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ కూడా గతంలో వన్డేల్లో 11 బాల్స్ ఓవర్ వేశారు. జస్ప్రిత్ బుమ్రా కూడా ఛాంపియన్స్ ట్రోఫి 2017 ఫైనల్లో పాకిస్తాన్‌పై 9 బాల్స్ ఓవర్ వేశాడు.
ఇక ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ చెత్త రికార్డులో పాకిస్తాన్ బౌలర్ ముందున్నాడు. పాక్ పేస్ బౌలర్ మహ్మద్ సమి 2004 ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో 17 బాల్స్ ఓవర్ వేశాడు. అందులో 7 వైడ్లు, 4 నో బాల్స్ ఉన్నాయి.