సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ చూసినవాళ్లెవరైనా సరే..పిచ్ గురించే మాట్లాడుతారు. స్లో వికెట్ లాగా అనిపించినప్పటికీ, గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయిన చోట, సన్‌రైజర్స్ బ్యాటర్లు ఎందుకు తేలిపోయారు. సాయి కిశోర్ వంటి స్పిన్నర్ సత్తాచాటిన చోట..సన్‌రైజర్స్ స్పిన్నర్లు ఎందుకు చతికిలపడ్డారు. యంగ్‌స్టర్ జీషన్ అన్సారీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కమిందు మెండిస్ కూడా అంతే. ఏ రకంగా చూసిన ఈ పిచ్ గుజరాత్ టైటన్స్ కోసం చేసిన పిచ్‌లాగే ఉంది తప్పా..సన్‌రైజర్స్‌కు ఏ మాత్రం ఫేవరబుల్‌గా లేదు. హార్డ్‌కోర్ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ మాత్రం కావాలనే పిచ్‌ను తమకు వ్యతిరేకంగా తయారు చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. కానీ ఈ వాదనలో ఏమాత్రం పసలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సన్‌రైజర్స్ అంతకు ముందు మూడు మ్యాచుల్లోనూ ఓడింది. ఫామ్‌లో లేని బ్యాటర్లు, పేలవంగా బౌలింగ్ చేస్తున్న బౌలర్లు..వెరసి ఓటమి పాలైంది. సరే అది నిజమే అనుకున్నా..ప్యాట్ కమిన్స్ ఎలాంటి బెదురు లేకుండా షాట్స్ ఎలా ఆడగలిగాడు..? పవర్ ప్లేలో సిమర్‌జిత్ ఓవర్ మినహాయిస్తే, మిగతా ఓవర్లన్నీ బాగా బౌలింగ్ ఎలా చేయగలిగారు? సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గినట్టు కనిపిస్తోంది. ఆటగాళ్లు కూడా మానసికంగా ధృడంగా కనిపించడం లేదు..అవి సెట్ చేసుకుంటే ఏ పిచ్ ఏమీ చేయలేదు..
టికెట్ల గొడవ..పిచ్ ఇష్యూకి కారణమా?

Categories:
Related Post

ఢిల్లీ పవర్ ప్లే మరీ దారుణంఢిల్లీ పవర్ ప్లే మరీ దారుణం
164 రన్స్ టార్గెట్ ఈజీ అవుతుందనుకుంటే..ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ పవర్ ప్లే పేలవంగా ముగిసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన యశ్ దయాల్…ఐదో బంతికే ఫాఫ్ డుప్లెసీని ఔట్ చేయగా, ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ కుమర్..ఫేజర్

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..
హోమ్ గ్రౌండ్.. ఫస్ట్ బ్యాటింగ్..ఇదేదో కలిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వర్షం కారణంగా కుదించిన 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,

మాజీ ఛాంపియన్లకు కష్టమేనా?మాజీ ఛాంపియన్లకు కష్టమేనా?
ఐపీఎల్ సీజన్ 18లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్‌పై ఒక అంచనాకు రావడం సరైనది కాకపోయినప్పటికీ…ఆ టీమ్స్ ఆటతీరు గురించి చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్,