Cricket Josh IPL ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?

ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?

ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా? post thumbnail image

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ ప్లేయ‌ర్…ర‌షీద్ ఖాన్‌ గుజ‌రాత్ టైట‌న్స్ బౌలింగ్ లైన‌ప్‌లో కీల‌క స్పిన్న‌ర్‌. ఐతే ఇత‌డు త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ మూడు మ్యాచులు ఆడ‌గా..ర‌షీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది కూడా అహ్మ‌దాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై. ఆ త‌ర్వాత ముంబైపై వికెట్లేమీ తీయ‌లేదు. ఇక ఆర్సీబీపై కూడా వికెట్ తీయ‌లేదు, పైగా 4 ఓవ‌ర్ల‌లో 54 ర‌న్స్ ఇచ్చి ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. మ‌రి ర‌షీద్ తిరిగి ఫామ్‌లోకి రావ‌డానికి హైద‌రాబాద్ వేదిక కానుందా అనే అనుమానాలు లేక‌పోలేదు. ఎందుకంటే ర‌షీద్ ఈ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అత‌డికి ఎంతో అనుభ‌వం ఉంది. ప్ర‌స్తుతం స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లు పెద్ద‌గా ఫామ్‌లో లేరు..ర‌షీద్ ఖాన్ ట‌చ్‌లోకి వ‌స్తే ఒక్క క్లాసెన్ మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. పేల‌వంగా బౌలింగ్ వేస్తున్న ర‌షీద్‌పై కౌంట‌ర్ ఎటాక్ చేస్తారా? లేదా దాసోహ‌మంటూ అత‌డిని తిరిగి ఫామ్ అందిపుచ్చుకునేలా చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

పే…..ద్ద ఓవ‌ర్పే…..ద్ద ఓవ‌ర్

శార్దూల్ ఠాకూల్…ఉర‌ఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 5 వైడ్‌లు వేశాడు. ఆ త‌ర్వాతే లీగల్‌గా ఓవ‌ర్ మొద‌లైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవ‌ర్ ముగించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇలా పే…ద్ద

బిగ్ మ్యాచ్‌..బిగ్ ప్లేయ‌ర్స్..ఫ్యాన్స్‌కు పండ‌గేబిగ్ మ్యాచ్‌..బిగ్ ప్లేయ‌ర్స్..ఫ్యాన్స్‌కు పండ‌గే

గుజ‌రాత్ టైట‌న్స్, రాజస్థాన్ రాయ‌ల్స్ మధ్య థ్రిల్ల‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌డం ఖాయం..వ‌రుస‌గా మూడు విజ‌యాలు సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉంది టైట‌న్స్…ఇక వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది రాయ‌ల్స్. రెండు టీమ్‌లూ గెలుపు జోరుతో ఈ మ్యాచ్‌కు

మ్యాచ్ విన్న‌ర్ లేడు..ఆ ముగ్గురు అవ‌స‌ర‌మా?మ్యాచ్ విన్న‌ర్ లేడు..ఆ ముగ్గురు అవ‌స‌ర‌మా?

థ‌లా ప‌గ్గాలు చేప‌ట్టినా, సీఎస్కే త‌ల‌రాత మాత్రం మారలేదు. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. 5 సార్లు ఛాంపియ‌న్‌గా గెలిచిన టీమ్‌..త‌మ సొంత‌గ‌డ్డ‌పై 20 ఓవ‌ర్లు ఆడినా 103 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌డ‌మంటే..ఇంత‌కు మించిన ఘోర‌ అవ‌మానం మ‌రొక‌టి