గ్లెన్ ఫిలిప్స్..ధనాధనా సిక్సర్లు కొట్టమంటే, సిక్సర్లు కొడతాడు. స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయమంటే వికెట్లు తీస్తాడు, కనీసం బ్యాటర్లను కట్టడైనా చేస్తాడు..క్యాచ్‌లు పట్టుకోవాలంటే నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లు పట్టుకుంటాడు. ఫిల్డింగ్ చేసి రన్స్ ఆపాలంటే డైవ్ చేసి మరి రన్స్ ఆపుతాడు. ఇన్ని డైమెన్షన్స్ ఉన్న ప్లేయర్‌ను ఏ టీమ్ ఐనా వదులుకుంటుందా..? అబ్బే ఐపీఎల్‌లో అట్లాంటి సిద్ధాంతాలేమీ ఉండవు..టాలెంట్ ఉన్నాసరే బెంచ్‌కే పరిమితం చేస్తారు..వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అందించడానికి ఉపయోగిస్తారు..ఇంత టాలెంటెడ్ ప్లేయర్ ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉండేవాడు..ఇప్పుడు గుజరాత్ టైటన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మారింది టీమ్ మాత్రమే, పొజిషన్ కాదు. బెంచ్‌కే పరిమితం. తాజాగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇతడిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఉపయోగించుకుంది. కానీ దురదృష్టవశాత్తు..ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకోబోయి ఇంజ్యూర్ అయ్యాడు. బంతి సెన్సిటివ్ ఏరియాలో తగలడంతో అతడు ఫిజియో సహకారంతో గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. ఫిలిప్స్‌కు అవకాశాలు రాక కలత చెందుతుంటే, మళ్లీ ఇలా గాయాలు కూడానా…పాపం ఫిలిప్స్ అంటూ నెటిజన్లు అతడికి సానుభూతితో కూడిన మద్దతు తెలుపుతున్నారు.
అయ్యో..ఫిలిప్స్

Related Post

రుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోనిరుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోని
వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

మూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదుమూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదు
కరుణ్ నాయర్, ఈ పేరు గుర్తుంది కదా..హార్డ్‌కోర్ టీమిండియా ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా, ఓవరాల్ క్రికెట్‌లో మూడో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

రషీద్ వికెట్ తీశాడోచ్..రషీద్ వికెట్ తీశాడోచ్..
ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ రషీద్‌ఖాన్‌కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ