Cricket Josh IPL ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు..

ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు..

ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు.. post thumbnail image

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజ‌న్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్ అద‌ర‌గొడుతున్నాడు. గ‌త సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ, చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నోపై గెలిచి..ఆత్మ‌విశ్వాసంతో సీజ‌న్‌ను ముగించింది. ఐతే ఎక్క‌డైతే ఆపిందో మ‌ళ్లీ అక్క‌డి నుంచే మొద‌లెట్టింది. ఈ సీజ‌న్ తొలి మ్యాచ్‌లో ల‌క్నోతో త‌ల‌ప‌డి భారీ టార్గెట్‌(210)ను ఛేదించి ఘ‌నంగా ఆరంభించింది. త‌ర్వాత స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై అల‌వోక‌గా గెలిచింది. మూడో మ్యాచ్‌లో చెన్నైని చెపాక్‌లో ఓడించి వావ్ అనిపించింది. ఇదే దూకుడుగా కొన‌సాగిస్తే..టైటిల్ రేసులో ఉండ‌టం గ్యారెంటీ.

టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్.. ఈ స్లో వికెట్‌పై 183 ప‌రుగుల డీసెంట్ స్కోర్ న‌మోదు చేసింది. ఫాఫ్ డుప్లెస్సీ లేక‌పోవ‌డంతో ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లో వ‌చ్చాడు. చివ‌రి వ‌ర‌కూ ఆడి 77 ర‌న్స్ తో ఇర‌గ‌దీశాడు. మిడిల్ ఓవ‌ర్స్‌లో అభిషేక్ పొరెల్, కెప్టెన్ అక్ష‌ర్ పటేల్ దూకుడుగా ఆడ‌గా..చివ‌ర్లో ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ 12 బాల్స్‌లో 24 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై ఏ ద‌శ‌లోనూ పోటీ ఇవ్వ‌లేక‌పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

RCBకే ఎక్కువ చాన్స్RCBకే ఎక్కువ చాన్స్

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ సొంత‌గ‌డ్డ‌పై మూడో మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌బోతోంది.  ఇప్ప‌టికే హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడిన ఆర్సీబీ ఈసారి ఆ ట్రెండ్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. మ‌రోవైపు పంజాబ్ 111 ర‌న్స్‌ను కూడా డిఫెండ్ చేసుకుని

ఉగ్ర‌దాడిని ఖండించిన ముంబై, స‌న్‌రైజ‌ర్స్ఉగ్ర‌దాడిని ఖండించిన ముంబై, స‌న్‌రైజ‌ర్స్

కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన ఉగ్రదాడిని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య‌, స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ ఖండించారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్ కోసం టాస్ స‌మ‌యంలో ఇద్ద‌రు కెప్టెన్లు ఉగ్ర‌దాడిని ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. త‌మ టీమ్స్‌, యావ‌త్

టాస్ గెలిచి బౌలింగ్..క‌రెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..క‌రెక్టేనా..?

గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో గుజ‌రాత్ టైట‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్ ఎంచుకుంది. త‌మ తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌కుండా బ‌రిలోకి దిగుతున్న‌ట్టు క‌మిన్స్ తెలిపాడు. మ‌రోవైపు గుజ‌రాత్ టైట‌న్స్ ఒక మార్పు చేసింది. క‌రీమ్