చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్..ఈ సీజన్‌లో నాసిరకం ఆటతీరు కనబరుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది. ఈ స్లో వికెట్‌పై కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 77 రన్స్ చేశాడు. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై పూర్తిగా విఫలమైంది. విజయ్ శంకర్ హాఫ్ సెంచరీ (69 నాటౌట్) చేసినప్పటికీ గెలుపుపై ఏ దశలోనూ నమ్మకం కలిగించలేకపోయాడు. తలా ధోని కూడా తన సహజశైలికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడి 30 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్డరు ఆడటం వల్లే 25 రన్స్ తేడాతో ఓడిపోయారు. లేదంటే ఆ మార్జిన్ మరింత ఎక్కువగా ఉండి నెట్ రన్‌రేట్‌పై ప్రభావం చూపేది.
నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లెవన్ అంత గొప్పగా ఏమీ ఉండట్లే..హార్డ్ హిట్టర్స్, మ్యాచ్ విన్నర్స్ కరువయ్యారు. శివమ్ దూబెను ఎన్నిసార్లు నమ్ముకుంటారు. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే నుంచి సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఎక్స్‌పెక్ట్ చేయలేం. విజయ్ శంకర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్స్ బదులు యంగ్‌స్టర్స్‌పై నమ్మకం పెట్టుకుంటే బెటర్. టీ20ల్లో స్ట్రైక్‌రేట్ చాలా కీలకం, ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రూవ్ అయింది. ఢిల్లీ బ్యాటర్ల స్ట్రైక్‌రేట్ 150కి పైనే ఉంది. కానీ చెన్నై బ్యాటర్లది 120కి మించలేదు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ ఆఖర్లో 12 బాల్స్‌లో 24 రన్స్ చేసి 200 స్ట్రైక్‌రేట్ మెయింటెన్ చేశాడు. ఆ పరుగులే గెలుపు, ఓటములను డిసైడ్ చేశాయని చెప్పొచ్చు. చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరైనా కనీసం 150 స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేస్తే ఫలితం మరోలా ఉండేది. ఇక ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపించినప్పటికీ అతడు కూల్‌గా ఆడుతూ డెఫినెట్లీ నాట్ అంటూ మళ్లీ చెప్పకనే చెప్పాడు.
విజిల్ మోగట్లే..

Categories: