వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్‌తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ తన రేంజ్ చూపించాల్సిందే. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్..కుదురుకొని ఆడాల్సిందే. నితీశ్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. క్లాసెన్ కూడా గేర్ మార్చాల్సిన టైమ్. బ్యాటింగ్‌లో కొన్ని లోపాలను సరిచేసుకున్నా..బౌలింగ్‌లోనూ రిపేర్ వర్క్స్ చాలా ఉన్నాయి. పేస్ బౌలర్ మహ్మద్ షమీ తన స్థాయికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి. హర్షల్ పటేల్..మరింత ఎఫెక్టివ్‌గా మారాలి. స్పిన్ విభాగంలో రాహుల్ చహార్‌కి చాన్స్ ఇవ్వొచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడమ్ జాంపను తీసుకోవాల్సిందే. బౌలింగ్‌ను స్ట్రాంగ్‌గా చేసుకోవాలంటే వికెట్‌టేకర్స్‌కు అవకాశమివ్వక తప్పదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు బాట పట్టాలంటే కచ్చితంగా తుది జట్టులో మ్యాచ్ విన్నర్లను, సీనియర్ బౌలర్లను చేర్చుకోవాలి. మరి కెప్టెన్ కమిన్స్ స్ట్రాటెజీ మారుస్తాడా? లేక దంచుడు ఫార్ములాకే కట్టుబడి ఉంటాడా? వేచి చూడాలి.
స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?

Related Post

తలా ఓ మాట అంటున్నారు..తలా ఓ మాట అంటున్నారు..
చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు..ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనిపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే తలాను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇంకెంతకాలం తలా తలా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయన బ్యాటింగ్

అట్లుంటది “ఇంపాక్ట్”అట్లుంటది “ఇంపాక్ట్”
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎప్పుడూ స్పెషలే, డిబేటబులే..ఆ డిస్కషన్ గురించి కాదుగానీ, ఓ సరదా సన్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. లక్నో, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లక్నో ఛేజింగ్ చేస్తున్న సమయంలో..ఇన్నింగ్స్ 13వ ఓవర్

ముంబై సిక్సర్‌ముంబై సిక్సర్
మొదటి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవలం ఒకటే గెలిచిన ముంబై ఇండియన్స్‌ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరు విశ్లేషకులైతే ఈ సీజన్‌లో చాన్సే లేదన్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ టీమ్‌కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్