కోల్‌త నైట్‌రైడర్స్‌లోని కీలక ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల పట్టికలో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ పదో స్థానంలో ఉన్నాయి. గత సీజన్ ఫైనలిస్ట్‌లు ముందడుగు వేయాలంటే ఇక్కడి నుంచే తిరిగి మొదలుపెట్టాలని ఆలోచనలో ఉన్నాయి. ఐతే సొంతగడ్డపై కేకేఆర్‌ను ఓడించడమంటే చిన్న విషయం కాదని సన్‌రైజర్స్‌కు తెలుసు. ఐతే ఆ టీమ్‌లో ఉన్న ఐదుగురు కీలక ఆటగాళ్ల విషయంలో జాగ్రత్త పడకపోతే సన్‌రైజర్స్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..
1. హర్షిత్ రాణా 2. వరుణ్ చక్రవర్తి 3. క్వింటన్ డికాక్ 4. ఆండ్రే రసెల్ 5. వెంకటేశ్ అయ్యర్
కేకేఆర్ పేస్ బౌలర్ హర్షిత్ రాణా..గత సీజన్‌లోనే సన్‌రైజర్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఈ పేసర్, టీమిండియాకు ఆడిన తర్వాత మరింత రాటుదేలాడు. సొంతగడ్డపై కొత్త బంతితో దూసుకొచ్చే ఇతడిని ఫామ్‌లో లేని సన్‌రైజర్స్ టాపార్డర్ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.
2. వరుణ్ చక్రవర్తి కూడా గత ఏడాది కాలం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ ఇండియా తరపున ఇరగదీస్తున్నాడు. ఇక ఈడెన్‌లోనూ ఈ మిస్టరీ స్పిన్నర్‌కి మంచి రికార్డ్ ఉంది. మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్ తప్ప మిగతా సన్‌రైజర్స్ బ్యాటర్లకు పెద్ద పరీక్షే.
3. క్వింటన్ డికాక్..ఓపెనింగ్‌లో దుమ్మురేపగల ఈ సఫారీ బ్యాటర్ ఫామ్‌లోనే ఉన్నాడు. అంతంత మాత్రంగా రాణిస్తున్న సన్‌రైజర్స్ బౌలర్లు డికాక్‌ను కట్టడి చేయకపోతే పవర్‌ప్లేలో విధ్వంసం తప్పదు.
4. ఆండ్రే రసెల్..ఈ విధ్వంసక, భయానక బ్యాటర్ నుంచి ఇంకా విస్ఫోటనాలు చూడలేదు..సిక్సర్ల జాతర కోసం ఆరాటపడుతున్న రసెల్..కాస్త వీక్‌గా కనిపిస్తున్న సన్‌రైజర్స్ బౌలింగ్ ఎటాక్‌పై విరుచుకుపడాలని చూస్తున్నాడు. మరి ఇతడిని కట్టడి చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఆలోచించాల్సిందే.
5. వెంకటేశ్ అయ్యర్..చూడటానికి సాఫ్ట్‌గా సాఫ్ట్‌వేర్‌లా కనిపిస్తాడు కానీ..కుదురుకుంటే రసెల్‌ను మించిన విధ్వంసం చేయగలడు. బ్యాటింగ్ అవకాశం వచ్చిన రెండు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. ఇతడి నుంచి కూడా ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. అది సన్‌రైజర్స్ పైనే కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బౌలర్లపైనే ఉంది.
ఆ ఐదుగురితో జాగ్రత్త

Categories: