Cricket Josh IPL అట్లుంట‌ది సిరాజ్‌తోని..

అట్లుంట‌ది సిరాజ్‌తోని..

అట్లుంట‌ది సిరాజ్‌తోని.. post thumbnail image

ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ పేస్ బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్‌..ప్ర‌త్య‌ర్థుల‌కు ఇచ్చిప‌డేస్తున్న‌డు. త‌న మాజీ టీమ్ ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి స‌త్తాచాటాడు. త‌ను ఏడు సీజ‌న్ల‌పాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్న‌స్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా లేదు. ముఖ్యంగా ఆర్సీబీ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసిన విధానం అదుర్స్..సిరాజ్ వేసిన‌ ఇన్నింగ్స్ 5వ ఓవ‌ర్ మూడో బంతికి సాల్ట్ భారీ సిక్స‌ర్ కొట్టాడు. ఆ త‌ర్వాత నాలుగో బంతికి సిరాజ్ అత‌డిని క్లీన్ బౌల్డ్ చేశాడు. సాల్ట్‌, సిరాజ్ మ‌ధ్య నిశ్శ‌బ్ద యుద్ధ‌మే జ‌రిగింది. సాల్ట్ వికెట్‌తో పాటు దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, హాఫ్ సెంచ‌రీ హీరో లియామ్ లివింగ్‌స్ట‌న్ వికెట్ల‌నూ త‌న ఖాతాలో వేసుకున్నాడు సిరాజ్. ఇక సోష‌ల్ మీడియాలో ఆర్సీబీని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు. మెగా ఆక్ష‌న్‌కు ముందు సిరాజ్‌ను రిటైన్ చేసుకోక‌పోవ‌డంపై ఆర్సీబీ అభిమానులు డిస‌ప్పాయింట్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆక్ష‌న్‌లోనూ సిరాజ్ కోసం వెళ్ల‌నేలేదు. ఆక్ష‌న్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్ల‌కు ద‌క్కించుకుంది. ఈ సీజ‌న్‌ తొలి మ్యాచ్‌లో వికెట్లేమీ తీయ‌ని సిరాజ్‌..ఆ త‌ర్వాత రెండు మ్యాచుల్లో క‌లిపి 5 వికెట్లు సాధించాడు. 2017లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆడాడు. ఆ త‌ర్వాత 2018 నుంచి 2015 వ‌ర‌కు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ)కే ఆడాడు. ఇప్పుడు అదే టీమ్‌పై ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్‌తో ఇచ్చిప‌డేసి ఈ సీజ‌న్‌లో ఓట‌మి రుచి చూపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

క్లాసెన్ కాకా..కెవ్వు కేక‌క్లాసెన్ కాకా..కెవ్వు కేక‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ రిటెన్ష‌న్ లిస్ట్ అంద‌రూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖ‌ర్చు చేసిన ధ‌ర మాత్రం ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సెకండ్ బెస్ట్..అక్ష‌రాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొట్టినా, ఇప్పుడు అవే

బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్

గుజ‌రాత్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..సెంచ‌రీ మిస్ చేసుకున్నా స‌రే, త‌న టీమ్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించాడు. అది కూడా 204 ప‌రుగుల టార్గెట్‌..అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి

ఎక్కువ మాట్లాడితే అంతే..ఎక్కువ మాట్లాడితే అంతే..

కామెంటేట‌ర్లు సైమ‌న్ డూల్, హ‌ర్షా భోగ్లేను ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్ట‌నివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ ఇద్ద‌రూ చేసిన కామెంట్సే ఇందుకు కార‌ణం. కేకేఆర్‌కు హోమ్ పిచ్ క‌లిసి రావ‌ట్లేద‌ని..వాళ్లు వేరే గ్రౌండ్