గత సీజన్‌లో మూడుసార్లు కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..ఈ సీజన్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..తమ రేంజ్ సరిపోలేదంటూ మరోసారి ఓడిపోయింది. బౌలర్లు మరోసారి నిరాశపరుస్తూ ప్రత్యర్థి కేకేఆర్‌కు 200 రన్స్ సమర్పించుకున్నారు. మిడిల్ ఓవర్స్‌లో వెంకటేశ్ అయ్యర్ ఇరగదీశాడు. 29 బాల్స్‌లో 60, రఘు వన్సి 30 బాల్స్‌లో 50, రింకూ 17 బాల్స్‌లో 32 నాటౌట్‌తో దుమ్మురేపారు.
201 రన్స్ టార్గెట్‌ను ఛేదించడంలో సన్‌రైజర్స్ ఏ దశలోనూ కుదురుకున్నట్టు కనిపించలేదు. పవర్ ప్లేలో 9 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా బ్యాటర్లు పెవిలియన్ దారి పట్టారు. కమిందు మెండిస్ కాసేపు ఫరవాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.75 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని అప్పుడే ఖాయం చేసుకుంది. కావాల్సిన రన్‌రేట్ కొండంత ఉండటంతో క్లాసెన్ కూడా ఔటవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.