రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రంజీల్లో ఇకపై ముంబైకి ఆడటం లేదు. ఇదే విషయాన్ని అతడు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ ద్వారా తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల ముంబైని వీడాల్సి వస్తోందని తెలిపాడు. గోవా తరపున ఆడేందుకు తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందిచినట్టు తెలుస్తోంది. 2019 నుంచి యశస్వి జైస్వాల్ ముంబై తరపున రంజీ మ్యాచ్‌లు 10, లిస్ట్ ఏలో 25, టీ20ల్లో 28 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక నుంచి గోవా తరపున ఆడబోతున్నాడు. దీనిపై స్పందిచిన గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శాంబ దేశాయ్..జైస్వాల్‌కు సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పాడు. నేషనల్ టీమ్‌లో పాల్గొనని టైమ్‌లో జైస్వాల్ గోవాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని తెలిపాడు. కాగా ఈ మధ్య కాలంలో ముంబై జట్టుని వదిలి గోవాకు ఆడుతున్న మూడో ప్లేయర్ జైస్వాల్. ఇతని కంటే ముందు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్, సిద్ధేశ్ లాడ్ కూడా ముంబై జట్టు నుంచి గోవా జట్టుకు చేరారు.
టీమ్ మారనున్న యశస్వి జైస్వాల్

Categories: