గత సీజన్‌లో అద్భుతంగా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునే టైమ్ వచ్చింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో తలపడబోతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్..ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. ఈ ఓటముల నుంచి తిరిగి కోలుకునేందుకు ఈడెన్ గార్డెన్‌ను వేదికగా చేసుకోవాలని కమిన్స్ అండ్ గ్యాంగ్ ఉవ్విళ్లూరుతోంది. ఐతే టాపార్డర్‌లో ట్రావిస్ హెడ్ తప్ప మిగతా ఎవ్వరూ సరిగా ఆడకపోవడం టీమ్ మేనేజ్మెంట్‌ను కలవరపెడుతోంది. బౌలర్లు కూడా తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. మరి లోపాలను సరిదిద్దుకుని నూతనోత్సాహంతో దూసుకుపోవాలంటే టీమ్‌లో మార్పులు అనివార్యం. అభిషేక్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి , హెన్రిక్ క్లాసెన్…ఈ ముగ్గురూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. ఇక ఈ సీజన్‌లోనే ఎస్ ఆర్ హెచ్‌లోకి అడుగుపెట్టిన అభినవ్ మనోహర్, వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. ఇతడి స్థానంలో అథర్వ టైడేకు అవకాశమిస్తే బెటర్. బౌలింగ్ ఆప్షన్స్‌ను కూడా చెక్ చేసుకుంటోంది టీమ్ మేనేజ్మెంట్. కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే తగిన మార్పులు చేసుకును బరిలోకి దిగాల్సిందే.
రివేంజ్‌తో కమ్ బ్యాక్ అవుతారా?

Categories:
Related Post

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..
నవంబర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అంతా సిద్ధమైంది. ఆటగాళ్లు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఆక్షన్ లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోగా, ఇందులో

బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్
వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు

లో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లేలో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లే
రెండొందలు..రెండొందలకు పైగా రన్స్‌ను ఛేజ్ చేసిన సందర్భాలు చూశాం..యమా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న సన్‌రైజర్స్ పై 245 రన్స్ కాపాడుకోలేకపోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్‌పై 112 పరుగుల స్కోర్‌ను కాపాడుకుని ఇది అంతకుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది. 112 రన్స్