వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ నిరాశపరచగా…మిడిల్ ఆర్డర్‌లో లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ ఆదుకున్నారు. లివింగ్‌స్టన్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్ దూకుడుగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గుజరాత్ టైటన్స్ 170 టార్గెట్‌ను ఆడుతు పాడుతూ చేజ్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 49 రన్స్ చేసి ఔటవగా..జాస్ బట్లర్ దుమ్మురేపాడు. 39 బాల్స్‌లో 73 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో రూథర్‌ఫోర్డ్ కూడా దూకుడుగా ఆడి 18 బాల్స్‌లో 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి ధాటికి గుజరాత్ మరో 13 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్

Related Post

లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్యలెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్‌శర్మ దగ్గరికి వెళ్లి అతడి

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కి
కర్ణ్‌శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అసలైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 పరుగుల టార్గెట్ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,

ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..
అదీ లెక్క..సన్‌రైజర్స్ కొడితే ఏనుగు కుంభస్థలమే..246 పరుగుల టార్గెట్..వీళ్ల ఆట ముందు చిన్నదైపోయింది. ఇక్కడ గెలుపోటముల ప్రస్థావన కాదు, లీగ్‌లో మరింత ముందుకెళతారో లేదో అనే లెక్కల గురించి కాదు, మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ల ఇంటెంట్ గురించి..ఆ ఇంటెంట్ గెలిచింది, గెలిపించింది.