సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్‌కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్‌లకు మిస్సైతే సన్‌రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లోనే హెడ్ ఒక్కడే నిలకడగా ఆడాడు. ఒక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (67), ఆ తర్వాత వరుసగా 47, 22 రన్స్ స్కోర్ చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యే వరకు నిలబడ్డాడు. ఇప్పటికే పేకమేడలా కుప్పకూలుతున్న సన్‌రైజర్స్‌కు హెడ్ లేకపోవడం పూడ్చలేని లోటుగా మారనుంది. ఒకవేళ హెడ్ వెళ్లిపోతే అతడి స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఐతే ట్రావిస్ హెడ్ ఎప్పుడు వెళతాడు, మళ్లీ ఎప్పుడు తిరిగొస్తాడనే విషయంపై సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?

Related Post

అట్లుంటది సిరాజ్‌తోని..అట్లుంటది సిరాజ్‌తోని..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నడు. తన మాజీ టీమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. తను ఏడు సీజన్లపాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్నస్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా

ఉగ్రదాడిని ఖండించిన ముంబై, సన్‌రైజర్స్ఉగ్రదాడిని ఖండించిన ముంబై, సన్‌రైజర్స్
కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖండించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కోసం టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తమ టీమ్స్, యావత్

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..
హోమ్ గ్రౌండ్.. ఫస్ట్ బ్యాటింగ్..ఇదేదో కలిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వర్షం కారణంగా కుదించిన 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,