చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు..ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనిపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే తలాను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇంకెంతకాలం తలా తలా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయన బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి రావడం లేదు, మ్యాచ్‌లు గెలిపించడం లేదు..ఏదో 17, 18వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగి..ఒక పది బాల్స్ ఆడి ఒక ఫోరో, సిక్సరో కొట్టి వెళ్లిపోతాడు..అదే మహాప్రసాదం అనుకుంటూ బతికేస్తున్నాం..తలా అభిమానులం…అంటూ కొందరు ఫ్యాన్స్ చెన్నై ఓటమి అనంతరం మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఐతే ఇంకొందరు హార్డ్‌కోర్ అభిమానులు మాత్రం ధోని ఎలా ఆడిన తమకు ఫరవాలేదని, ఎప్పుడు ఏం చేయాలో, ఎలా ఆడాలో ఆయనకు బాగా తెలుసని, ఒకటి రెండు ఓటముల వల్ల మాహీని విమర్శించేవాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆయనొక మ్యాచ్ విన్నర్ అని..టీమ్ కోసం ఇప్పటి వరకు ఏం చేశాడో రికార్డ్స్ చెబుతాయంటున్నారు. మరి మహీలోని మ్యాచ్ విన్నర్ మళ్లీ నిద్రలేచే చాన్స్ ఉందా? ఏదైమేనా అభిమానులు మాత్రం..మళ్లీ గెలిపించు తలా అని కోరుకుంటున్నారు.
తలా ఓ మాట అంటున్నారు..

Related Post

అట్లుంటది “ఇంపాక్ట్”అట్లుంటది “ఇంపాక్ట్”
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎప్పుడూ స్పెషలే, డిబేటబులే..ఆ డిస్కషన్ గురించి కాదుగానీ, ఓ సరదా సన్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. లక్నో, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లక్నో ఛేజింగ్ చేస్తున్న సమయంలో..ఇన్నింగ్స్ 13వ ఓవర్

విజిల్ మోగట్లే..విజిల్ మోగట్లే..
చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్..ఈ సీజన్‌లో నాసిరకం ఆటతీరు కనబరుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి

నలుగురి ఆడిషన్ సౌతాఫ్రికాలో..నలుగురి ఆడిషన్ సౌతాఫ్రికాలో..
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో నలుగురు తప్ప మిగతా వాళ్లంతా ఏదో ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న వాళ్లే…ఐతే ఆ నలుగురు ఇప్పుడు సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో సత్తాచాటితే ఇటు ఇండియాకు మేలు, అటు వాళ్లకు ఆక్షన్‌లో మంచి