రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవన్ చూడగానే టక్కున కనిపెట్టగలిగే లోపం ఒకటుంది. అదే మ్యాచ్ విన్నర్ లేకపోవడం. గత సీజన్ వరకు జాస్ బట్లర్ రాయల్స్ తరపున అదరగొట్టాడు. అంతకు ముందు సీజన్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ సీజన్‌కు ముందు బట్లర్ రిలీజ్ చేయడమే రాయల్స్ చేసిన అతిపెద్ద తపపు. పోనీ ఇప్పుడున్న టీమ్‌లో తోపులు లేరా అంటే లేరని కాదు, కానీ సరైన ఎగ్జిక్యూషన్ చూపించట్లే. యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు ఇరగదీసిందేమీ లేదు..ఇక సంజూ శాంసన్ తన మార్క్ చూపెట్టాల్సిందే. రియాన్ పరాగ్ కూడా త్వరగానే వికెట్ పారేసుకుంటున్నాడు. హెట్‌మెయిర్ క్లైమాక్స్‌లో పనికొస్తాడే తప్ప..కచ్చితంగా నిలబడి గెలిపించేంత క్యారెక్టర్ కాదు.. ఇప్పుడు వీళ్లు నమ్ముకోవాల్సింది సూపర్‌స్టార్ల నుంచి కన్సిస్టెన్సీ..ఏ ఇద్దరైనా సరిగా కుదురుకుంటేనే రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాటింగ్ పరమైన చిక్కులు తప్పుతాయి. లేదంటే ప్రతీ మ్యాచ్‌లో ఎవరి నుంచైనా అద్భుతం ఆశించాలి.
రాజస్థాన్ రాయల్స్ చేసిన తప్పు అదే..

Related Post

బట్లర్ రెడీ..రాయల్స్ బీ కేర్ ఫుల్బట్లర్ రెడీ..రాయల్స్ బీ కేర్ ఫుల్
మాజీ టీమ్‌లపై ప్లేయర్స్ పగబట్టినట్టుగా పెర్ఫార్మ్ చేయడం ఐపీఎల్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ లక్నో తరపున ఆడుతూ..తమ మాజీ టీమ్ సన్‌రైజర్స్‌పై ఇరగదీశారు. మొన్నటికి మొన్న గుజరాత్‌కు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ తన మాజీ టీమ్

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM
ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

సన్‌రైజర్స్ కి ‘షాన్’ దార్ వేటసన్‌రైజర్స్ కి ‘షాన్’ దార్ వేట
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో తమ టైటిల్ వేటను ఓ రేంజ్‌లో మొదలుపెట్టింది. టీమ్‌లోకి ఈ సీజన్‌లోనే అడుగుపెట్టిన ఇషాన్ కిషన్..ఆడినతొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ 286 పరుగుల భారీ స్కోర్ నమోదు