Cricket Josh IPL ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్‌ పెట్టాడు

ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్‌ పెట్టాడు

ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్‌ పెట్టాడు post thumbnail image

మొన్న‌టి మొన్న నికోల‌స్ పూర‌న్‌..స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై ఊచ‌కోత‌, విధ్వంసం, ప్ర‌ళ‌యం అన్నీ క‌ల‌గ‌లిపి సృష్టించిన విష‌యం గుర్తుంది క‌దా..తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఒక డీసెంట్ నాక్ ఆడాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నాడు. అర్థ‌మైంది క‌దా..ఈ లీగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 3 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచ‌రీలు చేసి మొత్తం 189 ర‌న్స్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 17 ఫోర్లు, 15 సిక్సులు బాదాడు. గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ డేంజ‌ర‌స్ బ్యాట్స్‌మ‌న్..త‌న పాత టీమ్‌పై 26 బాల్స్‌లో 70 ర‌న్స్ స్కోర్ చేసి ..ఇప్పుడు ఆరెంజ్ క్యాంప్ హోల్డ‌ర్‌గా నిలిచాడు..ఆరెంజ్ ఆర్మీని కొట్టి..ఆరెంజ్ క్యాప్ పెట్టాడ‌న్న‌మాట‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండ‌రీల వ‌ర్షం కురిసింది.ప‌రుగుల వ‌ర‌ద పారింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌లో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచ‌రీ (81) తో దుమ్మురేప‌గా, విధ్వంస ప్రేమికుడు నికోల‌స్ పూర‌న్ కేకేఆర్ బౌల‌ర్ల‌పై సునామీలా విరుచుకుప‌డ్డాడు.

ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మిగ‌తా స్లాట్స్‌ను ఎలా భ‌ర్తీ చేసుకున్నా, ఎవ‌రితో భ‌ర్తీ చేసుకున్నా స‌రే, వికెట్ కీప‌ర్ విష‌యంలో మాత్రం నిఖార్సైన బ్యాట‌ర్ క‌మ్ కీప‌ర్ కోసం చూస్తోంది. గ‌తంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిష‌న్‌ను

అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌

ఆక్ష‌న్‌లో ద‌క్కిన భారీ ధ‌ర‌..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడా? మెంట‌ల్లీ, టెక్నిక‌ల్లీ అంత ఫిట్‌గా అనిపించ‌డం లేదు. వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రూ. 23.75 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ వ‌శ‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం