ఐపీఎల్ సీజన్ 18లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్‌పై ఒక అంచనాకు రావడం సరైనది కాకపోయినప్పటికీ…ఆ టీమ్స్ ఆటతీరు గురించి చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ సరైన ఆరంభం లేక సతమతమవుతున్నాయి. ఓడిపోవడం కంటే, ఓడిన తీరే సమర్థనీయంగా అనిపించడంలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతలు అజింక్య రహానేకు అప్పగించడం మైనస్ అనే చెప్పాలి. రహానే రీసెంట్ టైమ్‌లో ఇండియాకు ఆడనే లేదు, దేశవాళీలో ఆడినప్పటికీ..ఐపీఎల్‌లో ఛాంపియన్ టీమ్‌ను లీడ్ చేయడమంటే మామూలు విషయం కాదు..మంచి ఆటగాళ్లున్నా, రహానే నాయకత్వంలో కేకేఆర్‌కు కలిసి రావట్లేదనే చెప్పొచ్చు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్..ఔట్ డేటెడ్ ఆటగాళ్లను జట్టులో ఉంచుకుని ఇబ్బందులు పడుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా విషయంలో అభిమానులు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ అంత కాన్ఫిడెంట్‌గా కనిపించడం లేదు, రచిన్ రవీంద్ర, శివమ్ దూబెను మినహాయిస్తే మిగతా వారెవ్వరూ ప్రామినెంట్‌గా అనిపించడం లేదు. ధోని, జడేజా, అశ్విన్..తమ అనుభవాన్ని ఉపయోగించి పాజిటివ్ రిజల్ట్స్ రాబట్టడంలో విఫలమవుతున్నారు. సీఎస్కే ఇదే ఆటతీరు కనబరిస్తే ముందుకెళ్లడం కష్టమే.
ముంబై ఇండియన్స్..బిపోర్ బుమ్రా, ఆఫ్టర్ బుమ్రా ఏదైనా తేడా కనిపిస్తే చెప్పలేం గానీ, ప్రస్తుతానికైతే ఆ టీమ్ తమ సామర్థ్యం తగ్గట్టుగా ఆడటం లేదు. మాజీ కెప్టెన్ రోహిత్ పేలవమైన ఫామ్, తిలక్ వర్మ, సూర్య అంతంత మాత్రంగా ఆడటం..కుర్రాళ్లు కుదురుకుంటున్నా వారిని ఇన్‌స్పైర్ చేయడంలో సీనియర్స్ మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా కనిపించడం లేదు..సీఎస్కేను ఓడించినప్పటికీ ఆ టీమ్ అంత స్ట్రాంగ్‌గా కనిపించడం లేదు. రియాన్ పరాగ్ కెప్టెన్సీలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక బ్యాటర్‌గానూ అంతంత మాత్రమే..సంజూ శాంసన్ కెప్టెన్సీ చేపట్టి, బ్యాటర్‌గానూ సత్తా చాటాలి. ముఖ్యంగా రాయల్స్ మ్యాచ్ విన్నర్‌ను మిస్ అవుతోంది. హెట్‌మెయిర్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
విధ్వంస రచనకు శ్రీకారం చుట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్..తొలి మ్యాచ్‌లో అదరగొట్టినప్పటికీ..ప్రత్యర్థి గెలుపు దగ్గరిదాకా రావడం, సన్‌రైజర్స్ బౌలింగ్ లోపాలను బయటపెట్టింది. ఇక ఆ తర్వాత మ్యాచుల్లో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ తప్ప మిగతా వారెవ్వరూ రాణించలేకపోతున్నారు. అనికేత్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరీ మూడొందలు లోడింగ్ కాదుగానీ..పరిస్తితులు తగ్గట్టుగా ఆడితేనే విజయాలు లోడింగ్..
ఈ మాజీ చాంపియన్లు డీలా పడుతున్న వేళ…పంజాబ్ కింగ్స్, లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ ఆకట్టుకుంటున్నాయి..ఏమో ఈసారి కొత్త ఛాంపియన్లను చూస్తామా?..ఐనా టోర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాలిగా…వీళ్లపై తర్వాత ఓ లుక్కేద్దాం.