గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్..ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది హార్దిక్ పాండ్య వర్సెస్ శుభ్‌మన్ గిల్..హార్దిక్ పాండ్య గుజరాత్‌కు చెందిన క్రికెటర్ అతడు గతంలో గుజరాత్ టైటన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం..ఏకంగా కెప్టెన్సీ అప్పగించడంతో ఇప్పుడు అతడు ఐపీఎల్‌లో ముంబైకర్ గా మారిపోయాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటన్స్‌కు కెప్టెన్..అతడికి అహ్మదాబాద్ గ్రౌండ్‌లో అనేక రికార్డులున్నాయి. గిల్ వర్సెస్ పాండ్య అంటే ఇద్దరు లోకల్స్ మధ్య ఫైట్‌లాగే ఉండబోతోంది. ప్రేక్షకులు సొంత జట్టుకు మద్దతు తెలిపినా..తమ క్రికెటర్‌కు కూడా సపోర్ట్ చేస్తారు. మరి పాండ్య ముంబైని తన సొంతగడ్డపై గెలిపిస్తాడా? శుభ్‌మన్ గిల్ గుజరాత్‌ని సొంత అభిమానుల ముందు గెలిపిస్తాడా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారనుంది.
చంటి లోకల్స్ ఫైట్

Related Post

14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..
నవంబర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అంతా సిద్ధమైంది. ఆటగాళ్లు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఆక్షన్ లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోగా, ఇందులో

ఇరగదీసి మరీ..ఇంట గెలిచిందిఇరగదీసి మరీ..ఇంట గెలిచింది
హమ్మయ్య.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి సొంతగడ్డపై మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో 3 ఓడిపోగా..ఈసారి గెలుపుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌కు