Cricket Josh IPL రంగంలోకి స్వ‌ప్నిల్..?

రంగంలోకి స్వ‌ప్నిల్..?

రంగంలోకి స్వ‌ప్నిల్..? post thumbnail image

గ‌త సీజ‌న్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేర‌డంలో త‌న‌దైన రోల్ పోషించిన‌ స్వ‌ప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జ‌ర‌గబోయే మ్యాచ్‌లో స్వ‌ప్నిల్ ఆడే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే సుయాశ్‌శ‌ర్మ‌, కృనాల్‌పాండ్య ఉండ‌గా వీరికి తోడు స్వ‌ప్నిల్‌ను తీసుకునే ఆలోచ‌న‌లో ఉంది ఆర్సీబీ. గ‌త మ్యాచ్‌లో ఆడిన ఆల్‌రౌండ‌ర్ ర‌సిక్‌దార్ స్థానంలో స్వ‌ప్నిల్‌ను తీసుకుంటారా అనేది కాస్త సందేహ‌మే. గ‌త సీజ‌న్‌లో డీసీకి ఆడి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆక‌ట్టుకున్న ర‌సిక్..ఈసారి ఆర్సీబీ త‌ర‌పున త‌న మార్క్ చూపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. చెపాక్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ర‌సిక్ స్థానంలో స్వ‌ప్నిల్‌ను తీసుకుంటే ఆర్సీబీ క‌లిసి రావొచ్చేమో..ఎందుకంటే గ‌త సీజ‌న్ క్లైమాక్స్‌లో ఆర్సీబీ ఫేట్ మారి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్ల‌డంలో స్వ‌ప్నిల్ కీ రోల్ ప్లే చేసిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

మ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచిందిమ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచింది

పంజాబ్ కింగ్స్‌కు వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ లో స్కోరింగ్ ఎన్‌కౌంట‌ర్‌ను చ‌విచూసింది. గ‌త మ్యాచ్‌లో కేకేఆర్‌పై 111 ర‌న్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 ర‌న్స్‌ను కొంచెం క‌ష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వ‌ధేరా (19 బాల్స్‌లో 33*,

ధోని..ద ఫినిష‌ర్..అంతేధోని..ద ఫినిష‌ర్..అంతే

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థ‌లా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన త‌రుణం రానే వ‌చ్చింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ద ఫినిష‌ర్ అనే ట్యాగ్ లైన్‌ను మ‌ళ్లీ గుర్తు

కింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దేకింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దే

పంజాబ్ కింగ్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య‌ జ‌రిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచ‌రీ సాయంతో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. వ‌రుస‌గా