Cricket Josh IPL అబ్బా..ఈ లార్డ్ ఒక‌డు..భ‌లే త‌గులుకున్నాడు

అబ్బా..ఈ లార్డ్ ఒక‌డు..భ‌లే త‌గులుకున్నాడు

అబ్బా..ఈ లార్డ్ ఒక‌డు..భ‌లే త‌గులుకున్నాడు post thumbnail image

ఆక్ష‌న్‌లో అన్‌సోల్డ్‌..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవ‌కాశం అత‌ణ్ని వ‌ద‌ల్లేదు. గాయంతో టోర్నీకి దూర‌మైన మొహిషిన్ ఖాన్ ప్లేస్‌లో శార్దూల్‌ను తీసుకుంది ల‌క్నో. అదే ఆ జ‌ట్టుకు ఇప్పుడు క‌లిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే ల‌క్‌న‌వూకు దేవుడిలా మార‌డు. యాక్ష‌న్‌లోకి దిగాడో లేదో ప‌ని మొద‌లెట్టాడు. ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్‌లోనే 2 వికెట్లు..ఇక గ‌త మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌పై 4 వికెట్లు..అది కూడా ఐపీఎల్ కెరీర్ బెస్ట్ న‌మోదు చేసుకున్నాడు.
అంతేకాదు బ్యాటింగ్‌కు స్వ‌ర్గంలా ఉండే పిచ్‌పై.. విధ్వంసానికి కేరాఫ్ అయిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్‌ను 200 మార్క్ చేర‌కుండా అడ్డుకున్నాడు. క్రెడిట్ అంతా శార్దూల్‌దే..ఇన్నింగ్స్ మొద‌ట్లోనే అభిషేక్‌ను ఔట్ చేసి స‌న్‌రైజ‌ర్స్ ప‌వ‌ర్‌ప్లే దూకుడుకు క‌ళ్లెం వేశాడు. ఆ త‌ర్వాత సెంచ‌రీ హీరో ఇషాన్ కిష‌న్‌ను తొలి బంతికే ఔట్ చేసి ప్ర‌త్య‌ర్థిని కోలుకోలేని దెబ్బ‌తీశాడు. మిగ‌తా బౌల‌ర్లూ స‌హ‌క‌రించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ 190 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. ఇక ల‌క్నో బ్యాట‌ర్లు మాత్రం ఈ టార్గెట్‌ను ఉఫ్‌మ‌ని ఊదేశారు. నికోల‌స్ పూర‌న్ పూన‌కం వ‌చ్చిన‌వాడిలా ఆడి 26 బంతుల్లోనే 70 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మ‌రో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (52) కూడా ఇర‌గ‌దీయ‌డం..అబ్దుల్ స‌మ‌ద్ ఫినిషింగ్ ట‌చ్ ఇవ్వ‌డంతో ల‌క్నో 191 ర‌న్స్ టార్గెట్‌ను 16.1 ఓవ‌ర్ల‌లోనే చేదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోనిరుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోని

వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కార‌ణంగా మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలున్నాయి.

ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వ‌దిలేశాడుఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వ‌దిలేశాడు

క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వ‌దిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుంద‌నేది మ‌నం ఎన్నో సంద‌ర్భాల్లో చూశాం. ఆ విష‌యం ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ ప‌తిదార్‌కు బాగా అర్థ‌మై, అనుభ‌వ‌మై ఉంటుంది. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో

ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మిగ‌తా స్లాట్స్‌ను ఎలా భ‌ర్తీ చేసుకున్నా, ఎవ‌రితో భ‌ర్తీ చేసుకున్నా స‌రే, వికెట్ కీప‌ర్ విష‌యంలో మాత్రం నిఖార్సైన బ్యాట‌ర్ క‌మ్ కీప‌ర్ కోసం చూస్తోంది. గ‌తంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిష‌న్‌ను