Cricket Josh IPL ధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదు

ధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదు

ధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదు post thumbnail image

టీమిండియా లెజెండ్స్ మ‌హేంద్ర‌సింగ్ ధోని, విరాట్ కోహ్లీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌బోతోందా? అంటే కానే కాదు..ఇద్ద‌రూ గ్రేట్ ప్లేయ‌ర్స్..జ‌స్ట్ గేమ్‌ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వ‌ర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్‌లో త‌ప్ప ఇంకెక్క‌డా ఆడ‌టం లేదు.. ఆల్రెడీ ఐపీఎల్‌లో 5 ట్రోఫీలు గెలిపించాడు. కుర్రాళ్ల‌కు భ‌రోసాగా ఉండేందుకు, అభిమానుల‌ను అల‌రించేందుకు ఆడుతున్నాడు. దీంతో అత‌డి ఆట, వికెట్ల వెన‌కాల అత‌డి వేట చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉంటారు. ఇక విరాట్ కోహ్లీ మాత్రం ఆర్సీబీని క‌చ్చితంగా గెలిపించేందుకు సాయ‌శ‌క్తులా పోరాడ‌తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కసారి కూడా టైటిల్ గెల‌వ‌ని ఆర్సీబీలో హంగ‌ర్ బాగా ఉంద‌నే చెప్పాలి. ఇక చెపాక్‌లో ఆర్సీబీ రికార్డు చెత్త‌గా ఉంది. సీఎస్కేతో ఇక్క‌డ 8 మ్యాచ్‌లు ఆడితే ఒకే ఒక్క‌సారి గెలిచింది. అది కూడా 8 ఏళ్ల క్రితం. మ‌రి ఇప్పుడా రికార్డును మెరుగుప‌ర‌చుకోవాల‌నే త‌ప‌న‌తో ఉంది.
యంగ్ కెప్టెన్ ర‌జ‌త్ ప‌టిదార్‌, ఫారిన్ హిట్ట‌ర్స్ ఫిల్ సాల్ట్, లివింగ్‌స్ట‌న్, టిమ్ డేవిడ్‌ ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే చెన్నై బౌల‌ర్ల టార్గెట్. గ‌త మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ వేసిన నూర్ అహ్మ‌ద్, ఖ‌లీల్ అహ్మ‌ద్ మ‌రోసారి విజృంభించే చాన్స్ఉంది. సీనియ‌ర్ బౌల‌ర్లు అశ్విన్, జ‌డేజా కూడా ఇర‌గ‌దీసేందుకు రెడీ అయ్యారు. లిట‌ర‌ల్‌గా ఇది ధోని వ‌ర్సెస్ కోహ్లీ కానే కాదు..ఆర్సీబీ బ్యాటింగ్ వ‌ర్సెస్ సీఎస్కే బౌలింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?

చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్‌శ‌ర్మ‌లాగా, రాజ‌స్థాన్‌కు సంజూ శాంస‌న్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన‌, ఆడుతున్న సూప‌ర్‌స్టార్ ప్లేయ‌ర్స్ ఎవ‌రైనా ఒక‌రు స‌న్‌రైజ‌ర్స్‌కూ ఉంటే బాగుండ‌ని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ స‌న్‌రైజ‌ర్స్ ఎక్కువ‌గా ఫారిన్

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలేరివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

గ‌త సీజ‌న్‌లో మూడుసార్లు కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఈ సీజ‌న్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..త‌మ రేంజ్ స‌రిపోలేదంటూ మ‌రోసారి ఓడిపోయింది. బౌల‌ర్లు మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ ప్రత్య‌ర్థి కేకేఆర్‌కు 200 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నారు.

అశుతోప్ శ‌ర్మ‌..ఢిల్లీ హీరోఅశుతోప్ శ‌ర్మ‌..ఢిల్లీ హీరో

అశుతోష్ శ‌ర్మ‌..నువ్వు తోపు శ‌ర్మ‌..గ‌త సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌పున ఆడి ఇర‌గ‌దీస్తే అదుర్స్ అనుకున్నాం..కానీ అది జ‌స్ట్ ట్రైల‌రే.. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ త‌ర‌పున అరంగేట్రం చేస్తూ..వ‌న్ మ్యాన్ షో చేసి త‌మ టీమ్‌ను గెలిపించాడు. లిట‌ర‌ల్‌గా చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం