అశుతోష్ శర్మ..పంజాబ్ కింగ్స్‌ను గెలిపించిన హీరో. లక్నో సూపర్ జెయింట్స్ పై హీరోచిత ఇన్నింగ్స్ ఆడి 210 పరుగుల టార్గెట్‌ను చేదించడంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ యంగ్‌స్టర్. ఐతే మ్యాచ్ గెలిపించిన తర్వాత అతడు స్విచ్ హిట్ కొట్టినట్టు సెలబ్రేట్ చేస్తూ..పంజాబ్ మెంటార్ కెవిన్ పీటర్సన్‌కు థాంక్స్ చెప్పాడు. దీంతో అశుతోష్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన క్రెడిట్ అంతా పీటర్సన్‌దే అని చాలా మంది అనుకున్నారు. కానీ తెరవెనక ఉన్నది టీమిండియా లెజెండ్ శిఖర్ ధావన్. ఈ విషయాన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటున్న సమయంలో అశుతోష్ స్వయంగా చెప్పాడు. తన సక్సెస్ కు కారణం శిఖర్ ధావన్ అని, అతడి థాంక్స్ చెప్పాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న అశుతోష్‌కు శిఖర్ ధావన్ నుంచి వీడియో కాల్ వచ్చిందని..ధావన్, అశుతోష్‌కు అభినందనలు తెలియజేశాడు. ఈ విషయాన్ని వెంటనే అశుతోష్ తన టీమ్‌మేట్స్‌కు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
నిజానికి 2024 ఐపీఎల్ (సీజన్‌కు ముందే) ప్రీ సీజన్ క్యాంప్‌లో ధావన్‌ను అశుతోష్ కలిశాడు. అప్పుడే అశుతోష్ టాలెంట్‌పై ఒక అభిప్రాయానికొచ్చిన ధావన్ అతడిని ఎంకరేజ్ చేశాడు. ఆటకు ముందే ఎలా ఆడాలో అనేది విజువలైజ్ చేసుకోవాలంటూ సలహాలూ ఇచ్చాడు. ధావన్ తన బ్యాట్‌ను అశుతోష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బ్యాట్‌తోనే అశుతోష్ రంజీ అరంగేట్రంలో గుజరాత్‌పై సెంచరీ చేశాడు. అప్పటి నుంచి ఈ యంగ్‌స్టర్ ధావన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ సలహాలు సూచనలూ తీసుకుంటున్నాడు. అదీ మ్యాటరు.