Cricket Josh Uncategorized ఉత్కంఠ‌పోరులో గుజ‌రాత్‌కు పంజాబ్ ఝ‌ల‌క్

ఉత్కంఠ‌పోరులో గుజ‌రాత్‌కు పంజాబ్ ఝ‌ల‌క్

ఉత్కంఠ‌పోరులో గుజ‌రాత్‌కు పంజాబ్ ఝ‌ల‌క్ post thumbnail image

గుజ‌రాత్ గెలుపు కోసం 6 బాల్స్‌లో 27 ర‌న్స్ కావాలి.. క్రీజులో రూథ‌ర్‌ఫోర్డ్‌..పంజాబ్ కింగ్స్ త‌ర‌పున బౌలింగ్‌కు అర్ష్‌దీప్ సింగ్.. తొలి బంతికే రూథ‌ర్‌ఫోర్డ్ షాట్ కొట్ట‌గా బాల్ నేరుగా నాన్‌స్ట్రైక‌ర్ ఎండ్‌లో స్టంప్స్‌కు త‌గిలింది. బౌల‌ర్ చేయి కూడా త‌గ‌ల‌డంతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న రాహుల్ తెవాటియా పెవిలియ‌న్‌కు వెనుదిరిగాడు. ఆ త‌ర్వాతి బాల్‌కు రూథ‌ర్‌ఫోర్డ్ సిక్స‌ర్ బాదాడు. ఈక్వేష‌న్ 4 బాల్స్‌లో 21 ర‌న్స్‌గా మారింది. మ‌రుస‌టి బాల్‌కు 2 ర‌న్స్ రాగా..నెక్ట్స్ బాల్‌కే అర్ష్‌దీప్, రూథ‌ర్‌ఫోర్డ్‌ను బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత లాంఛ‌నం పూర్తి చేశాడు. దీంతో గుజ‌రాత్ 232 ర‌న్స్‌కే ప‌రిమిత‌మ‌వ‌గా, పంజాబ్ 11 ర‌న్స్ తేడాతో గెలిచింది.

ఐపీఎల్ ఆక్ష‌న్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకున్న పంజాబ్ కింగ్స్…ఈ సీజ‌న్ తొలి మ్యాచ్‌లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఆడింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెన‌ర్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ప్రియాన్ష్ ఆర్య 47 ర‌న్స్ చేసి శుభారంభం అందించ‌గా..ఆ త‌ర్వాత కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ చెల‌రేగి ఆడాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌కు శ‌శాంక్ కూడా జ‌త‌క‌లిసి దుమ్మురేపాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ 97 నాటౌట్, శ‌శాంక్ 47 నాటౌట్ గా నిలిచారు. దీంతో పంజాబ్ 243 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో గుజ‌రాత్ నిరాశ‌ప‌రిచింది. సాయి సుద‌ర్శ‌న్‌, జాస్ బ‌ట్ల‌ర్ హాఫ్ సెంచ‌రీలు చేసినా..కెప్టెన్ శుభ్‌మ‌న్ 33 ర‌న్స్ చేసినా త‌మ జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన వైశాక్ విజ‌య్‌కుమార్ అద్భుత‌మైన స్పెల్‌తో ఆక‌ట్టుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post