Cricket Josh IPL మామ‌ను మిస్ చేసుకోవ‌ద్దు

మామ‌ను మిస్ చేసుకోవ‌ద్దు

మామ‌ను మిస్ చేసుకోవ‌ద్దు post thumbnail image

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రిలీజ్ చేసిన ఆట‌గాళ్ల‌లో ఏడెన్ మార్క్‌ర‌మ్ కూడా ఉన్నాడు. తెలుగు అభిమానులు ముద్దుగా మార్క్‌ర‌మ్ మామ అని పిలుచుకునే ఈ సౌతాఫ్రికా కెప్టెన్‌..బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద‌ర‌గొట్టాడు. మంచి రికార్డ్ ఉన్న ఇత‌డిని స‌న్‌రైజ‌ర్స్ వ‌దులుకుంది స‌రే, మ‌ళ్లీ ఆక్ష‌న్‌లో ద‌క్కించుకుంటుందా అంటే దాదాపుగా ఔన‌నే చెప్పాలి. ఎందుకంటే, సౌతాఫ్రికాలో కూడా ఐపీఎల్ లాంటి లీగ్ జ‌రుగుతోంది. అందులో కూడా స‌న్‌రైజ‌ర్స్ ఈస్ట్ర‌న్ కేప్ టీమ్ ఉంది. దానికి కెప్టెన్ ఏడెన్ మార్క్‌ర‌మ్‌, ఇప్ప‌టి రెండు సీజ‌న్లు జ‌ర‌గ‌గా, రెండు సార్లు స‌న్‌రైజ‌ర్స్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. మ‌రి ఇంత‌టి ట్రాక్ రికార్డ్ ఉన్న మార్క్‌ర‌మ్‌ను మెగా ఆక్ష‌న్‌లో ఎలాగైనా ద‌క్కించుకుంటుద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.
నిజానికి SRH బ్యాటింగ్ లైన‌ప్ లో ఓపెన‌ర్లుగా అభిషేక్‌శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ ఉంటారు. మిడిల్ ఆర్డ‌ర్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ ఉండ‌నే ఉన్నారు. ఐతే నెంబ‌ర్ 3లో ఆడేందుకు అనుభ‌వ‌జ్ఞుడైన‌, నిఖార్సైన ప్లేయ‌ర్ అవ‌స‌రం. ఆ ప్లేస్ మార్క్‌ర‌మ్‌కు సూట్ అవుతుంది. ఆల్రెడీ ఫారిన్ కోటాలో కెప్టెన్ క‌మిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఉన్నారు. మ‌రో ఐదుగురు ఫారిన్ ప్లేయ‌ర్స్‌నూ తీసుకోవ‌చ్చు. మ‌రి ఆ జాబితాలో మార్క్‌ర‌మ్ ఉంటే బెట‌ర్ అని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అవ‌స‌ర‌మైతే ఆర్టీఎమ్ ఉప‌యోగించి మార్క్‌ర‌మ్‌ను తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.
2022 నుంచి 2023 వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2024లో ప్యాట్ క‌మిన్స్‌కు కెప్టెన్సీ అప్ప‌గించి మార్క్‌ర‌మ్‌ను ప్లేయ‌ర్‌గా కొన‌సాగించింది స‌న్‌రైజ‌ర్స్.. మిడిల్ ఆర్డ‌ర్‌లో చాలా కీల‌క‌మైన ప్లేయ‌ర్‌, ఎన్నో ఇన్నింగ్స్‌లు ఒంట‌రిపోరాటం చేశాడు. నిల‌క‌డ‌గా ఆడ‌గ‌ల‌డు, సిక్స‌ర్లు బాద‌గ‌ల‌డు.. మ‌రి ఈసారి ఆక్ష‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఏం చేస్తుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

బ‌ట్ల‌ర్ రెడీ..రాయ‌ల్స్ బీ కేర్ ఫుల్బ‌ట్ల‌ర్ రెడీ..రాయ‌ల్స్ బీ కేర్ ఫుల్

మాజీ టీమ్‌ల‌పై ప్లేయ‌ర్స్ ప‌గ‌బ‌ట్టిన‌ట్టుగా పెర్ఫార్మ్ చేయ‌డం ఐపీఎల్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ స‌మ‌ద్ ల‌క్నో త‌ర‌పున ఆడుతూ..త‌మ మాజీ టీమ్ స‌న్‌రైజ‌ర్స్‌పై ఇర‌గ‌దీశారు. మొన్న‌టికి మొన్న గుజ‌రాత్‌కు ఆడుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌న మాజీ టీమ్‌

ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్

బ్రిటీష్ సింగ‌ర్‌, టీవీ న‌టి జాస్మిన్ వాలియా ముంబై ఇండియ‌న్స్ టీమ్ బ‌స్సులో క‌నిపించ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య‌తో ఈ అమ్మ‌డు డేటింగ్‌లో ఉన్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికారు

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, దాదాపుగా త‌మ ప్లేయింగ్ లెవ‌న్‌ను మార్చ‌దు. టీమ్ నిండా సీనియ‌ర్ ప్లేయ‌ర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజ‌న్‌లో మిగ‌తా ఫ్రాంచైజీలు కుర్రాళ్ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్‌, విఘ్నేశ్‌,