ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఐతే ఆక్షన్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది కేఎస్ భరత్ గురించి. 2015లోనే ఐపీఎల్ ఆక్షన్‌లో ఇతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఐతే స్క్వాడ్‌లో చేరినా, ఆడే చాన్స్ రాలేదు. 6 ఏళ్ల గ్యాప్ తర్వాత 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇతడిని టీమ్‌లోకి తీసుకుంది. 8 మ్యాచ్‌లు ఆడి 191 రన్స్ చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ (78) కూడా ఉంది. అంతేకాదు అదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. ఐనా సరే ఎందుకోగానీ ఆర్సీబీ అతడిని వదులుకుంది. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ఇతడిని తమ జట్టులో తీసుకుని కేవలం 2 మ్యాచ్‌లు ఆడించింది. 2023లో గుజరాత్ టైటన్స్, 2024లో కోల్‌కత నైట్‌రైడర్స్ తీసుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాక బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఐతే కేఎస్ భరత్ టీమ్ కేకేఆర్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఫ్రాంచైజీ కూడా ఇప్పటికీ అతడి రంజీ పెర్ఫార్మెన్స్‌పై ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తోంది. రీసెంట్‌గా రంజీ మ్యాచుల్లో భరత్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. గుజరాత్‌పై రెండు ఇన్నింగ్సుల్లో 98, 47 రన్స్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌పై 65 రన్స్ చేశాడు. అంతేకాదు వికెట్ కీపర్‌గానూ అదరగొట్టాడు. గుజరాత్‌పై 5 క్యాచ్‌లు , హిమాచల్ ప్రదేశ్‌పై 3 క్యాచ్‌లూ తీసుకున్నాడు. మరి ఈ తెలుగు కుర్రాడికి కేకేఆర్ మద్దతుగా నిలిచి మరోసారి ఆక్షన్‌లో దక్కించుకుంటుందా? మరేదైనా ఫ్రాంచైజీ మంచి ధరకు ఇతడిని తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల అభిమానులైతే ఈసారి భరత్ ఫేట్ మారాలని ఆశిస్తున్నారు.
ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే
Categories: